పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా చారిత్రక నేపథ్యంలో రూపొందిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. పదిహేడవ శతాబ్దం నాటి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలిసింది. క్రిష్ దర్శకుడు. నిధి అగర్వాల్ కథానాయిక. నేటి నుంచి హైదరాబాద్‌లో పోరాటఘట్టాల్ని తెరకెక్కించబోతున్నారు. విదేశీ యాక్షన్ కొరియోగ్రాఫర్ టోదర్ లజారోవ్ నిర్దేశకత్వంలో ఈ సీక్వెన్స్‌కు రూపకల్పన చేస్తున్నారు.
యాక్షన్ ఎపిసోడ్ రిహార్సల్‌కు సంబంధించిన ఫొటోల్ని చిత్ర బృందం సోషల్‌మీడియాలో పంచుకుంది. ‘హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ ఇది. సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. రిహార్సల్ ఫొటోల్లో పవన్‌కల్యాణ్ బల్లెం పట్టుకొని చక్కటి ఫిట్నెస్తో కనిపిస్తున్నారు. సినిమాలోని పాత్రకు అనుగుణంగా ఆయన శరీరాకృతిని తీర్చిదిద్దుకున్నారని అంటున్నారు. అక్టోబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.