Jr NTR | కీలక ఘట్టానికి ‘దేవర’
షూటింగ్ నుంచి చిన్న విరామం దొరకగానే కుటుంబంతో వెకేషన్‌కు వెళ్లారు స్టార్ హీరో ఎన్టీఆర్. తాజాగా ఆ పర్యటన ముగించుకుని తిరిగివచ్చారు. తన కొత్త సినిమా ‘దేవర’ షెడ్యూల్ కోసం ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.
షూటింగ్ నుంచి చిన్న విరామం దొరకగానే కుటుంబంతో వెకేషన్‌కు వెళ్లారు స్టార్ హీరో ఎన్టీఆర్. తాజాగా ఆ పర్యటన ముగించుకుని తిరిగివచ్చారు. తన కొత్త సినిమా ‘దేవర’ షెడ్యూల్ కోసం ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఈ సినిమా పలు దఫాలుగా షూటింగ్స్ జరుపుకుంది. వీటిలో ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించారు.
ఇక తాజా అప్డేట్ ప్రకారం ఈ వారంలోనే ‘దేవర’ కొత్త షెడ్యూల్ ప్రారంభించుకోనున్నారు. ఈ షెడ్యూల్లో విలన్ సైఫ్ అలీఖాన్, ఎన్టీఆర్, నాయిక జాన్వీ కపూర్ మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తున్నది. సినిమాలో ఈ పార్ట్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుందని, అందుకే దర్శకుడు కొరటాల శివ పక్కాగా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట. ఎలాగైనా ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని టీమ్ భావిస్తున్నది. చిత్రీకరణతో పాటే నిర్మాణానంతర కార్యక్రమాలూ జరుపుతున్నారని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

