Jr NTR | భాషలకు అతీతంగా
Jr NTR | తన నట ప్రయాణాన్ని భాషలకు అతీతంగా సాగిస్తున్నారు తారక్. ప్రస్తుతం ఆయన హృతిక్ రోషన్‌తో కలిసి బాలీవుడ్లో ‘వార్ 2’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ఆయన ముంబైలోనే ఉన్నారు.
Jr NTR | తన నట ప్రయాణాన్ని భాషలకు అతీతంగా సాగిస్తున్నారు తారక్. ప్రస్తుతం ఆయన హృతిక్ రోషన్‌తో కలిసి బాలీవుడ్లో ‘వార్ 2’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ఆయన ముంబైలోనే ఉన్నారు. అక్కడ తారక్‌పై దర్శకుడు అయాన్ ముఖర్జీ భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్‌లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు యష్‌రాజ్ ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమా తర్వాత కన్నడ దర్శకుడు ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో నటిస్తారు తారక్. మరో వైపు తారక్ కోసం తమిళ దర్శకులు అట్లీ, వెట్రిమారన్ కథలు వండే పనిలో ఉన్నారు. వారితో కూడా తారక్ సినిమాలు చేయనున్నట్టు కోలీవుడ్ సమాచారం. ప్రస్తుతం తారక్ చేయబోయే సినిమాలన్నీ పరభాషా దర్శకులతోనే కావడం విశేషం. తెలుగు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాతో కూడా ఓ సినిమా ఉంటుందని తెలుస్తున్నది.
కాకపోతే ఆ ప్రాజెక్ట్‌కు రెండుమూడేళ్లు పట్టడం ఖాయం. ఆర్ఆర్ఆర్, దేవర చిత్రాల తర్వాత మారిన ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని పాన్ ఇండియా రేంజ్ కథలను ఎంచుకుంటూ, అందుకు తగ్గ దర్శకులను ఎన్నుకుంటూ ఓ ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నారు తారక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

