Jr NTR | జపనీస్ భాషలో అకట్టుకున్న ఎన్టీఆర్.. వీడియో వైరల్..!
Jr NTR | జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రాంచరణ్ (Ram Charan) కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR). ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ ను ఎలా షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా, ఈ చిత్రం శుక్రవారం (అక్టోబరు 21) జపాన్‌లో విడుదలైంది. తమ సినిమాను ప్రమోట్ చేసేందుకు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తోపాటు చిత్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి అక్కడికి వెళ్లారు.
Jr NTR | జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రాంచరణ్ (Ram Charan) కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR). ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ ను ఎలా షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా, ఈ చిత్రం శుక్రవారం (అక్టోబరు 21) జపాన్‌లో విడుదలైంది. తమ సినిమాను ప్రమోట్ చేసేందుకు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తోపాటు చిత్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి అక్కడికి వెళ్లారు. ఈ నేపథ్యంలో జరిగిన ఓ ప్రమోషన్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ జపనీస్ భాషలో ప్రసంగించి అభిమానులను అకట్టుకున్నారు.
‘అందరికీ నమస్కారం, మీరందరూ ఎలా ఉన్నారు. మిమ్మిల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సినిమాను చూసి ఎంజాయ్ చేయండి’ అంటూ జపనీస్‌లో భాషలో మాట్లాడారు. అనంతరం ఇంగ్లీష్‌లో తన ప్రసంగాన్ని కొనసాగించారు. ‘‘మిమ్మల్ని చూడగానే జపాన్ భాషలో మాట్లాడాలని అనిపించింది. ఏవైనా తప్పులుంటే మన్నించండి. నేను జపాన్ లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఎన్నో చెప్పాలనిపిస్తోంది’’ అంటూ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.
ఎన్టీఆర్ గతంలో నటించిన అనేక చిత్రాలు జపాన్ లో విడుదలై ప్రజాదరణ పొందాయి. దీంతో ఆయనకు అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో మరోసారి జపాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో అలియాభట్, అజయ్ దేవ్గన్, శ్రియాశరణ్, ఒలివియా మోరిస్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్‌గా రూ.1200 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ లో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా.. ఎన్టీఆర్ కొమ్రంభీం పాత్రలో కనిపించారు.
NTR @tarak9999 addressing the crowd in fluent Japanese while promoting #RRRinJapan pic.twitter.com/9rYrH64pmx
— Vamsi Kaka (@vamsikaka) October 21, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

