N.T.R | ఇప్పుడంతా ‘ఆర్ఆర్ఆర్’ హవా నడుస్తుంది. సౌత్ టూ నార్త్ వరకు కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తుంది. జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో తారక్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం గురించి ప్రేక్షకులతో పాటు సినీప్రముఖుల చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇద్దరు హీరోల నటన, రాజమౌళి టేకింగ్‌కు ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ ఈ చిత్రంతో మరో ఘనత సాధించాడు.
బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంతో ఎన్టీఆర్ వరసగా ఆరు హిట్లతో డబుల్ హ్యట్రిక్ను సాధించాడు. పూరీ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ నుంచి, నాన్నకు ప్రేమతో , జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, తాజాగా విడుదలైన ఆర్ఆర్ఆర్తో కలిసి తారక్ వరుసగా ఆరు విజయాలను సాధించాడు. టెంపర్ ముందు తారక్ రామయ్యవస్తావయ్యా, రభస చిత్రాలతో వరుసగా రెండు ఫ్లాప్‌లను మూట గట్టుకున్నాడు.