NTR | సినీ తారలు ఎంత బిజీగా ఉన్నా.. షూటింగ్స్‌కు కాస్త విరామం దొరికితే చాలు కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి విదేశీ వెకేషన్లకు వెళ్లడం సర్వసాధారణం. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కూడా తమ బిజీ షెడ్యూల్‌కు చిన్న బ్రేక్ ఇచ్చి యూరప్‌లో విహరిస్తున్నారు. ఒకరు కుటుంబంతో కలిసి ఇటలీలో సందడి చేస్తుంటే.. మరొకరు స్నేహితురాళ్లతో కలిసి స్పెయిన్ అందాలను ఆస్వాదిస్తున్నారు. దీంతో వీరిద్దరి వెకేషన్ విశేషాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆలియా భట్ ప్రస్తుతం స్పెయిన్‌లోని అందమైన మల్లోర్కా దీవిలో తన స్నేహితురాళ్లతో కలిసి సమయాన్ని గడుపుతున్నట్లు తెలుస్తోంది. అక్కడి అందమైన సముద్ర తీరాలు, ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలను ఆస్వాదిస్తూ తన వెకేషన్‌కు సంబంధించిన మధుర జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకుంటోంది.
ఈ వెకేషన్ సమయంలో ఆలియా తన ఇన్స్టాగ్రామ్ డిస్ప్లే ఫొటోను కూడా మార్చింది. ఎరుపు రంగు గౌను ధరించి సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తున్న ఫొటోను డీపీగా పెట్టుకోవడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. దీనికి ముందు భర్త రణ్‌బీర్ కపూర్‌తో కలిసి అలీబాగ్‌లో వెకేషన్‌కు వెళ్లిన ఆలియా.. ఇప్పుడు స్నేహితురాళ్లతో కలిసి స్పెయిన్‌లో చిల్ అవుతోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి ఇటలీలో హాలిడేను ఆస్వాదిస్తున్నారు. సన్నిహిత స్నేహితులతో కలిసి యూరప్ ట్రిప్‌కు వెళ్లిన ఈ దంపతులకు సంబంధించిన కొన్ని క్యూట్, క్యాండిడ్ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఎప్పుడూ వరుస షూటింగ్స్, ప్రమోషన్స్‌తో బిజీగా ఉండే తారక్.. తనకు దొరికిన ఈ చిన్న విరామాన్ని భార్యతో కలిసి ప్రశాంతంగా గడుపుతున్నారు.
సినిమాల కోసం నిరంతరం శ్రమించే ఎన్టీఆర్ ఇలా కుటుంబంతో కలిసి విదేశాల్లో రిలాక్స్ అవుతుండటం నందమూరి అభిమానులను కూడా ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే.. సూపర్‌స్టార్ మహేష్ బాబు కూడా త్వరలో కుటుంబంతో కలిసి విదేశీ వెకేషన్‌కు వెళ్లనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ‘వారణాసి’ చిత్రీకరణలో బిజీగా ఉన్న మహేష్.. ఈ వారంలో షూటింగ్ పూర్తి చేసుకుని కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లనున్నారనే ప్రచారం మొదలైంది.