RB Choudary | రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత దుర్మరణం..!
RB Choudary : దక్షిణాది సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత, నటుడు జీవా(Jiiva) తండ్రి ఆర్బీ చౌదరీ (RB Choudary) దుర్మరణం చెందారు.
RB Choudary : దక్షిణాది సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత, నటుడు జీవా(Jiiva) తండ్రి ఆర్బీ చౌదరీ(RB Choudary) దుర్మరణం చెందారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టిన ఘటనలో ఆర్బీ చౌదరీ మృతి చెందారు. అక్కడ ఒక పెళ్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.
దక్షిణాది చిత్రసీమలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై పలు చిత్రాలను నిర్మించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆర్బీ చౌదరీ మరణవార్తతో సినీలోకం విషాదంలో మునిగిపోయింది. చౌదరీ అంత్యక్రియలు చెన్నైలో జరుగనున్నాయి. ఆయనకు భార్య మహ్జబీన్తో పాటు, జీవా, రమేశ్, అశోక్.. ముగ్గురు కుమారులున్నారు.
Legendary film producer #RBChoudhary has reportedly passed away in a tragic car accident in Udaipur just now.
Our heartfelt condolences go out to his family and friends during this difficult time. May his soul rest in peace. pic.twitter.com/PQZm1EvIPn
— Chennai Times (@ChennaiTimesTOI) May 5, 2026
సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ‘నట్టమయి’, ‘థుల్లథా మనముమ్ థుల్లుమ్’, ‘సూర్యవంశం’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన ఆయన.. ఫాహద్ ఫాజిల్, వడివేలుతో 98వ చిత్రంగా ‘మారీసన్’ రూపొందించారు. నటుడు విశాల్ దర్శకత్వంలో మగుదమ్ అనే సినిమాను నిర్మించారు కూడా. కానీ, ఇంతలోనే ఆర్బీ చౌదరీని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆయన మరనం పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో రాజా, నిన్నే ప్రేమిస్తా, సంక్రాంతి, నువ్వు వస్తావని, సుస్వాగతం, శివరామరాజు, రచ్చ, వంటి చిత్రాలను ఆర్బీ చౌదరీ నిర్మించారు.
Shocking 😲😳 R. B. Choudhary ( Actor Jivva Father Super Good Films) Passed Away in a tragic accident in Udaipur.
May his soul rest in peace🥺🙏 pic.twitter.com/QHodgNk30F
— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) May 5, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

