Spy Movie | నిఖిల్ స్పై మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్
Spy Movie Songs | కార్తికేయ-2తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న నిఖిల్. అంతేకాకుండా తన మార్కెట్ కూడా ఇప్పుడు చాలా పెరిగింది. ఈ క్రమంలో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. పైగా జనాల్లో కూడా నిఖిల్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయం ఉంది.
Spy Movie Songs | కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టిన పేరు యంగ్ హీరో నిఖిల్. ఆయన నుండి సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ అనే ట్యాగ్‌ను సంపాదించుకున్నాడు. ఇక ‘కార్తికేయ-2′ ఏకంగా పాన్ ఇండియా రేంజ్లో హిట్టు కొట్టి స్క్రిప్ట్ సెలక్షన్లో తను ఎంత మేటీ అనేది నిరూపించాడు. ఇక ఇటీవలే రిలీజైన ’18పేజీస్’ కాస్త నిరాశపరిచింది. అయితే నిఖిల్ ఉన్న ఫామ్‌లో ఈ ఒక్క ఫ్లాప్ తన మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు. పైగా ఇది కూడా బ్రేక్ ఈవెన్ దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ఇక ప్రస్తుతం నిఖిల్ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘స్పై’ ఒకటి. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయమవుతూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్లకు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
జూమ్ జూమ్ అంటూ సాగే మెలోడియస్ పాట శ్రోతలను తెగ ఆకట్టుకుంటుంది. విశాల్ చంద్ర శేఖర్ స్వర పరిచిన ఈ గీతాన్ని అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా ఆలపించారు. కిట్టు విస్సప్రగాడ సాహిత్యం అందించాడు. జూన్ 29న విడుదల కాబోతున్న ఈ సినిమాలో స్వాతంత్రోద్యమ నేత సుభాష్ చంద్రబోస్‌కి సంబంధించిన రహస్యాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు టీజర్ తో స్పష్టం చేశారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను ఈడి ఎంటర్టైనమెంట్స్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి, చరణ్ తేజ్ ఉప్పలపాటిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిఖిల్‌కు జోడీగా సాన్య థాకూర్, ఐశ్వర్య మీనన్‌లు నటిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ సంగీతం స్వరపరుస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

