మల్టీస్టారర్ వార్తలు నిజమేనా?
పాన్ ఇండియా లెవల్లో ఓ భారీ మల్టీస్టారర్‌కి తెరలేస్తున్నట్టు కోలీవుడ్ మీడియాలో ఓ వార్త బలంగా వినిపిస్తున్నది. తాజాగా ‘జైలర్ 2’తో బ్లాక్‌బస్టర్‌ని సొంతం చేసుకున్న కోలీవుడ్ అగ్ర దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్, తన తర్వాతి ప్రయత్నంగా ఓ మల్టీస్టారర్ కథను సిద్ధం చేశారట.
పాన్ ఇండియా లెవల్లో ఓ భారీ మల్టీస్టారర్‌కి తెరలేస్తున్నట్టు కోలీవుడ్ మీడియాలో ఓ వార్త బలంగా వినిపిస్తున్నది. తాజాగా ‘జైలర్ 2’తో బ్లాక్‌బస్టర్‌ని సొంతం చేసుకున్న కోలీవుడ్ అగ్ర దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్, తన తర్వాతి ప్రయత్నంగా ఓ మల్టీస్టారర్ కథను సిద్ధం చేశారట. ఈ కథను టాలీవుడ్ అగ్రహీరోలైన ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లకు కూడా వినిపించారట. ఈ స్టార్లిద్దరూ ఈ కథ విషయంలో పాజిటివ్‌గా స్పందించారనేది ఈ వార్త సారాంశం.
పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ ఉన్న హీరోలు తారక్, బన్నీ. వీరిద్దరినీ కలపాలనే ఆలోచనే గొప్పదని, వారిద్దరూ నిజంగా కలిసి నటిస్తే రికార్డులు షేక్ అవ్వడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ‘డ్రాగన్’తో తారక్, ‘రాకా’తో బన్నీ బిజీగా ఉన్నారు. ఈ సినిమాల తర్వాత కూడా వీరికి ఇతర చిత్రాల కమిట్మెంట్స్ ఉన్నాయి. నెల్సన్ కూడా ‘జైలర్ 2’ చివర్లో ‘జైలర్ 3’ ఉంటుందని లీడ్ ఇచ్చాడు. మరి ఈ మల్టీస్టారర్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో వేచి చూడాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

