కొత్త దర్శకుడికి ఓకే చెప్పిన జాతిరత్నం

స్క్రీన్ రైటర్‌గా కెరియర్ స్టార్ట్ చేసిన నవీన్ పోలిశెట్టి.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో నటుడిగా నిలదొక్కుకున్నాడు. ఈ సినిమా ప్రేక్షకులని అలరించడంతో తర్వాత జాతిరత్నం అనే సినిమా చేశాడు. ఇందులో తన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బ నవ్వించిన నవీన్ తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు.
జాతిరత్నం అనేట్టుగానే అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చి.. భారీ స్థాయిలో ఫాలోయింగ్ రాబట్టాడు. ఇంతటి క్రేజ్ దక్కించుకున్న నవీన్ పోలిశెట్టి.. ఈ మధ్య పలు సేవా కార్యక్రమాలు చేస్తూ వార్తల్లోకి ఎక్కాడు. సమీర్ అనే వ్యక్తి కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయి కష్టాల్లో ఉన్నాడని తెలుసుకున్న నవీన్ పోలిశెట్టి తన ట్విట్టర్ ద్వారా హైదరాబాద్‌లో ఎక్కడైనా ఉద్యోగం ఉంటే చెప్పండి, అతనికి సాయం చేయండని కోరాడు. ఈ ట్వీట్‌కు స్పందించిన ఎవోక్ అనే సంస్థ.. ఆ నిరుద్యోగికి సహాయం చేస్తూ ఉద్యోగం ఇచ్చింది.
ఇక నవీన్ తన తర్వాతి ప్రాజెక్ట్ కోసం కొన్నాళ్లుగా వైవిధ్యమైన కథలు వింటున్నాడు. జాతిరత్నాలు రైటింగ్ డిపార్ట్ మెంట్ లో కీలకంగా పని చేసిన కళ్యాణ్ అనే కొత్త దర్శకుడు చెప్పిన లైన్ బాగా నచ్చడంతో అతనితో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడట. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. కాగా, యువి కాన్సెప్ట్ సంస్థ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందించే సినిమాలో నవీన్ హీరోగా నటిస్తున్నట్టు సమాచారం. ఇది పూర్తిగా కొత్త తరహాలో ఉంటుందట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

