Natti Kumar | టాలీవుడ్లో ముదురుతున్న పర్సంటేజీ వివాదం.. ప్రొడ్యూసర్ కౌన్సిల్ పదవికి నట్టి కుమార్ రాజీనామా
Natti Kumar | తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న పర్సంటేజీ విధానం వివాదం ఇప్పుడు మరింత వేడెక్కింది. ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై గత కొంతకాలంగా బహిరంగంగా స్పందిస్తున్న ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ, సంస్థ పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Natti Kumar | తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న పర్సంటేజీ విధానం వివాదం ఇప్పుడు మరింత వేడెక్కింది. ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై గత కొంతకాలంగా బహిరంగంగా స్పందిస్తున్న ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ, సంస్థ పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మే 13, 2026న తన రాజీనామా లేఖను కౌన్సిల్ కార్యవర్గానికి పంపిన నట్టి కుమార్, ముఖ్యంగా ఆదాయ పంపిణీ వ్యవస్థలో ఉన్న లోపాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య అమలవుతున్న పర్సంటేజీ విధానాన్ని సమర్థవంతంగా నియంత్రించడంలో కౌన్సిల్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎగ్జిబిటర్ల ఆధిపత్యం పెరిగిపోతుండగా, చిన్న మరియు మధ్యతరగతి నిర్మాతలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాతల హక్కులను కాపాడాల్సిన సంస్థ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. “తోటి నిర్మాతలకు న్యాయం చేయలేని స్థితిలో ఆ పదవిలో కొనసాగడం అర్థరహితం” అంటూ ఆయన తన రాజీనామాకు కారణాన్ని వివరించారు. అంతేకాకుండా, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో పారదర్శకత పూర్తిగా లోపించిందని కూడా నట్టి కుమార్ ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడం లేదని, కార్యవర్గ సభ్యులకు సరైన సమాచారం ఇవ్వకుండా రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, ఆడిటింగ్ వంటి కీలక అంశాల్లో జవాబుదారీతనం కనిపించడం లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు.
కొంతమంది వ్యక్తుల ఆధిపత్యంతో కౌన్సిల్ స్వతంత్రత కోల్పోతోందని, సంస్థ ప్రతిష్ట దెబ్బతింటోందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. నిర్మాతలందరి సంక్షేమం కోసం పని చేయాల్సిన సంస్థ ప్రస్తుతం కొందరి చేతుల్లో కీలుబొమ్మలా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.తన రాజీనామాతో పాటు కౌన్సిల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని కూడా నట్టి కుమార్ ప్రస్తావించారు. వెంటనే పారదర్శక ఎన్నికలు నిర్వహించాలని, అర్హత కలిగిన ఆడిటర్లు, అకౌంటెంట్లను నియమించి ఆర్థిక వ్యవహారాల్లో స్పష్టత తీసుకురావాలని సూచించారు. అలాగే కీలక నిర్ణయాల్లో కార్యవర్గ సభ్యులందరికీ భాగస్వామ్యం కల్పించాలని కోరారు. నట్టి కుమార్ రాజీనామా ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే పర్సంటేజీ విధానంపై నిర్మాతల మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో మరింత చర్చకు దారితీశాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

