Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
Naresh | టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ మరోసారి తన హాట్ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచారు. పెళ్లిళ్లు, ప్రస్తుత తరం ఆలోచనలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. అనుపమ పరమేశ్వరన్, నరేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా కుటుంబ కథాచిత్రం ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Naresh | టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ మరోసారి తన హాట్ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచారు. పెళ్లిళ్లు, ప్రస్తుత తరం ఆలోచనలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. అనుపమ పరమేశ్వరన్, నరేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా కుటుంబ కథాచిత్రం ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి” అంటూ నరేశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కిన ‘క్రేజీ కల్యాణం’ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ప్రస్తుత తరం పెళ్లిళ్ల గురించి నరేశ్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. ఇప్పటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడం సరైన నిర్ణయమా? ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఎలాంటి అభిప్రాయానికి వస్తారు? అని అడగ్గా ఆయన తనదైన శైలిలో స్పందించారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా కరెక్టే. సహజీవనం కూడా అధికారికంగా ఆమోదం పొందినట్టుగా మారింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికీ కొంతమంది పెళ్లిళ్లు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి అని నరేశ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత సమాజంలో వివాహ వ్యవస్థపై మారుతున్న అభిప్రాయాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ముఖ్యంగా పిల్లలను కనాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ‘క్రేజీ కల్యాణం’ విషయానికి వస్తే.. అనుపమ పరమేశ్వరన్, నరేశ్ తండ్రీకూతుళ్లుగా నటిస్తున్నారు. కూతురికి పెళ్లి చేయాలని తండ్రి పట్టుదలగా ఉండటం, మరోవైపు తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని కూతురు ప్రయత్నించడం ఈ కథలో ప్రధాన అంశాలుగా కనిపిస్తున్నాయి.
కూతురి పెళ్లి కోసం తండ్రి అమెరికా సంబంధాన్ని తీసుకొస్తాడు. అయితే, తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకునే కూతురు ఆ సంబంధాన్ని తప్పించుకోవాలని చూస్తుంది. చివరకు తండ్రి పట్టుదల నెగ్గుతుందా? కూతురి ప్రేమ గెలుస్తుందా? అన్న ఆసక్తికరమైన అంశాలతో సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. కుటుంబ అనుబంధాలు, ప్రేమ, హాస్యం, భావోద్వేగాలను కలగలిపి ఈ చిత్రాన్ని రూపొందించారు. తండ్రీకూతుళ్ల మధ్య జరిగే సంఘటనలు ప్రేక్షకులను నవ్వించడంతో పాటు భావోద్వేగానికి గురిచేసేలా ఉంటాయని ట్రైలర్ సూచిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా, తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
Ramayana | ‘రామాయణ’ రెండో ట్రైలర్ దసరాకేనా.. అక్టోబర్ 20న మరో భారీ అప్డేట్!
Ram Charan | రామ్ చరణ్ – అనిరుధ్ కాంబినేషన్ ఫిక్స్.. క్రేజీ కాంబోపై భారీ అంచనాలు!
Shreyas Iyer | శ్రేయస్ అయ్యర్ ఔట్‌తో కన్నీళ్లు పెట్టుకున్న మహిళా అభిమాని .. వైరల్‌గా మారిన వీడియో
Zayn Marie | ఆమిర్ ఖాన్ మేనకోడలికి గాయాలు.. పోలీసుల చర్యలపై జైన్ మేరీ ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

