Navdeep | నవదీప్ మొబైల్‌ను స్వాధీనం చేసుకున్న నార్కోటిక్స్..! ఏడేళ్ల కిందటి కాల్ లిస్ట్‌తో విచారించారన్న నటుడు..!
Navdeep | మదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్ శనివారం నార్కోటిక్ బ్యూరో ఎదుట హాజరయ్యాడు. దాదాపు అధికారులు ఆరుగంటల పాటు విచారించారు. విచారణ అనంతరం నవదీప్ మీడియాతో మాట్లాడారు. నార్కోటిక్స్ బ్యూరో అధికారులు డ్రగ్స్ కేసులో విచారించారించరని తెలిపారు.
Navdeep | మదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్ శనివారం నార్కోటిక్ బ్యూరో ఎదుట హాజరయ్యాడు. దాదాపు అధికారులు ఆరుగంటల పాటు విచారించారు. విచారణ అనంతరం నవదీప్ మీడియాతో మాట్లాడారు. నార్కోటిక్స్ బ్యూరో అధికారులు డ్రగ్స్ కేసులో విచారించారించరని తెలిపారు. టీఎస్ నాబ్ అధికారులు అద్భుతమైన టీమ్‌ను ఏర్పాటు చేశారని, టీఎస్ నార్కోటిక్ అధికారులకు దేశంలో మంచి రికార్డు ఉన్నదని పేర్కొన్నారు. అయితే, ఏడేళ్ల క్రితం కాల్ లిస్ట్ ఆధారంగా విచారిస్తున్నారని, బీపీఎం అనే క్లబ్‌తో నాకున్న సంబంధాలపై ఆరా తీశారని చెప్పుకొచ్చారు. కొంత సమాచారం తెలుసుకునేందుకు విచారణకు రావాలని నోటీసు ఇచ్చారని.. అయితే, నేనెప్పుడు డ్రగ్స్ తీసుకోలేదని నవదీప్ తెలిపారు.
విశాఖకు చెందిన రామచంద్ దగ్గర నేను డ్రగ్స్ కొనలేదని, గతంలో పబ్ నిర్వహించినందుకే నన్ను విచారించారని చెప్పారు. గతంలో సిట్, ఈడీ విచారించిందని, ఇప్పుడు తెలంగాణలో నార్కోటిక్ పోలీసులు విచారిస్తున్నారన్నారు. నార్కోటిక్ అధికారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, అవసరం ఉంటే మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పారన్నారు. అయితే, నవదీప్ సెల్‌ఫోన్‌ను నార్కోటిక్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, విచారణ సమయంలో కాల్‌లిస్ట్‌ను ముందుంచి విచారణ జరిపినట్లుగా తెలుస్తున్నది. వాట్సాప్ చాటింగ్‌ను అధికారులు రిట్రీవ్ చేయనున్నట్లు తెలుస్తున్నది. డేటా అందించిన తర్వాత మరోసారి నవదీప్‌ను నార్కోటిక్ బ్యూరో అధికారులు వివరించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

