జ్ఞాపకాల దొంతర సుందరకాండ
‘ఇదొక పెక్యులర్ లవ్‌స్టోరీ. ఈ జర్నీ చాలా స్పెషల్. దర్శకుడు వెంకటేశ్ మంచి కథ రాసుకున్నాడు. నిర్మాతలు సంతోష్, గౌతమ్, రాకేష్‌లు కథను బాగా నమ్మారు. ఈ కథే మా అందర్నీ కలిపింది.
‘ఇదొక పెక్యులర్ లవ్‌స్టోరీ. ఈ జర్నీ చాలా స్పెషల్. దర్శకుడు వెంకటేశ్ మంచి కథ రాసుకున్నాడు. నిర్మాతలు సంతోష్, గౌతమ్, రాకేష్‌లు కథను బాగా నమ్మారు. ఈ కథే మా అందర్నీ కలిపింది. ఈ సినిమాకు అన్నీ బాగా కుదిరాయి. మంచి కంటెంట్‌తో రాబోతున్నాం. ఆదరిస్తారని నమ్ముతున్నా’ అని నారా రోహిత్ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘సుందరకాండ’.
వృత్తి వాఘని, శ్రీదేవి విజయ్‌కుమార్ కథానాయికలు. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకుడు. సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్‌రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మాతలు. ఈ సినిమా నిర్మాణం తుదిదశకు చేరుకుంది. మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడారు. టీజర్ లాగే సినిమా కూడా క్లీన్ ఎంటర్టైనర్ అనీ, సినిమా చూసిన వాళ్లు మంచి మెమరీస్‌తో ఇంటికెళ్తారని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు. నరేశ్, వాసుకి ఆనంద్, సత్య, అజయ్, వీటీవీ గణేశ్, అభినవ్ గోమఠం రూపాలక్ష్మీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ప్రదీప్ ఎం.వర్మ, సంగీతం: లియోన్ జేమ్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

