Nara Rohit | నవంబర్‌లో నారా వారింట పెళ్లి సందడి.. లీక్ చేసిన రోహిత్
Nara Rohit | టాలీవుడ్లో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ హీరోల్లో నారా రోహిత్ ఒకరు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడి సోదరుడి కుమారుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన రోహిత్, కెరీర్ ప్రారంభంలోనే బాణం, ప్రతినిధి వంటి సినిమాలతో సీరియస్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
Nara Rohit | టాలీవుడ్లో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ హీరోల్లో నారా రోహిత్ ఒకరు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడి సోదరుడి కుమారుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన రోహిత్, కెరీర్ ప్రారంభంలోనే బాణం, ప్రతినిధి వంటి సినిమాలతో సీరియస్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే కొన్ని వరుస ఫ్లాపులతో అతని కెరీర్ కాస్త డౌన్ అయ్యింది. దీంతో కొన్నేళ్లు గ్యాప్ తీసుకుని వెయిట్ & లుక్ లో భారీ మార్పులు చేసుకున్నారు. రోహిత్, తాజాగా ‘సుందరకాండ’ అనే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు రాగా, పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన ఈ సినిమా, రోహిత్‌కి మంచి బూస్టప్‌ని అందించింది.
యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ రూపొందిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌ను రాబట్టడంతో, రోహిత్ ప్రమోషన్స్‌లో ఫుల్ జోష్‌తో పాల్గొంటున్నారు. తాజాగా గుంటూరులో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న రోహిత్, అక్కడ గణేశుడిని దర్శించుకుని అభిమానులతో, మీడియాతో మాట్లాడారు. “ఇంత కాలం తర్వాత ఆడియెన్స్ నుంచి ఇలా స్పందన రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది నాకు నమ్మకాన్ని కలిగిస్తోంది,” అని చెప్పారు.ఈ సందర్భంగా రోహిత్ తన పెళ్లి గురించి కూడా ఓ బిగ్ అప్డేట్ ఇచ్చారు. అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలో నా పెళ్లి జరుగుతుంది అని అధికారికంగా ప్రకటించారు.
ఇప్పటికే ‘ప్రతినిధి 2’ సినిమాలో హీరోయిన్గా నటించిన శిరీష (సిరి) తో రోహిత్‌కి నిశ్చితార్థం జరిగింది. అయితే, ఎప్పుడో వీరి వివాహం జరగాల్సి ఉండగా, రోహిత్ తండ్రి ఆకస్మికంగా మృతిచెందడంతో ఈ వేడుక వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ కొత్త షెడ్యూల్‌ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. సుందరకాండ తర్వాత తన తదుపరి సినిమాలు వేరే జోనర్స్, అన్ని వర్గాల ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ ఉంటాయని, త్వరలోనే వాటిపై అధికారిక ప్రకటన చేస్తానని కూడా రోహిత్ తెలిపారు. మొత్తానికి, “సుందరకాండ” సినిమా నారా రోహిత్ కెరీర్‌నే కాకుండా వ్యక్తిగత జీవితాన్నీ కొత్త దిశగా తీసుకెళ్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Marriage
- Nara Rohit
- siri lella
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ అద్భుత పోరాటం..! కివీస్ స్కోరు 243/5
KCR | తెలంగాణ ఒక నిఖార్సయిన ఉద్యమకారున్ని కోల్పోయింది : కేసీఆర్
Bandla Ganesh | బండ్ల గణేశ్‌కు జైలుశిక్ష.. రూ. 95 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు కీలక తీర్పు
Tyson Naidu Teaser | మాస్ యాక్షన్ విందుతో బెల్లంకొండ ‘టైసన్ నాయుడు’ టీజర్.!
Siddipeta | పోలీసుల దిగ్బంధనంలో సిద్దిపేట.. ఎక్కడికక్కడే బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

