Nara Rohit | నారా కుటుంబంలో నెలకొన్న ఆనందం.. తండ్రైన నారా రోహిత్, అభిమానులు హ్యాపీ
Nara Rohit | టాలీవుడ్ నటుడు నారా రోహిత్ కుటుంబంలో సరికొత్త ఆనందం నెలకొంది. నారా రోహిత్, ఆయన భార్య శిరీష దంపతులకు మగబిడ్డ జన్మించినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. ఈ శుభవార్తతో నారా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, సినీ ప్రముఖులు దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Nara Rohit | టాలీవుడ్ నటుడు నారా రోహిత్ కుటుంబంలో సరికొత్త ఆనందం నెలకొంది. నారా రోహిత్, ఆయన భార్య శిరీష దంపతులకు మగబిడ్డ జన్మించినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. ఈ శుభవార్తతో నారా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, సినీ ప్రముఖులు దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.కొత్త జీవితాన్ని ప్రారంభించిన కొద్ది నెలల్లోనే నారా రోహిత్ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోట్ కావడంతో కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంది. తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో అభిమానులు సోషల్ మీడియాలో నారా రోహిత్‌కు అభినందనలు తెలుపుతున్నారు.
నారా రోహిత్, శిరీషల నిశ్చితార్థం గత ఏడాది అక్టోబర్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. అనంతరం ఈ ఏడాది ప్రారంభంలో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరైన ఈ వేడుక అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నారా కుటుంబానికి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఈ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక టాలీవుడ్లో విభిన్న కథలను ఎంపిక చేసుకునే నటుడిగా నారా రోహిత్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కమర్షియల్ సినిమాలకు భిన్నంగా కంటెంట్ ప్రధానమైన కథలను ఎంచుకుంటూ ఆయన తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నారు.
ఇటీవల విడుదలైన ‘సుందరకాండ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఆయన, మరోసారి నటుడిగా ప్రశంసలు అందుకున్నారు. పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.ప్రస్తుతం నారా రోహిత్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. దసరా కానుకగా విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే సమయంలో సోలో హీరోగా మరో చిత్రంలో కూడా నటిస్తున్న ఆయన, కెరీర్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | కంటిలో విత్తనం మొలిచెనే.. సైబీరియాలో వింత ఘటన
KTR | అన్నిటికీ హాలిడేలు ప్రకటించిన ఈ 420 సర్కార్కే హాలిడే ఇస్తే దరిద్రం పోతది.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం
IND vs NZ | నేడు న్యూజిలాండ్‌తో నాలుగో టీ20.. సిరీస్‌ను క్లీన్‌స్వీస్ చేయడమే లక్ష్యంగా బరిలోకి టీమిండియా..!
KTR | తేలిపోతున్న కుట్రలు.. దారికొస్తున్న కుట్రదారులు.. మొన్న ఈనాడు.. నేడు సురేఖ క్షమాపణలు
Konda Surekha | కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నా… కొండా సురేఖ క్షమాపణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

