Nara Lokesh | ‘జై బాలయ్య’ అంటూ నారా లోకేష్ సందడి.. జగపతిబాబు షోలో బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు!
Nara Lokesh | ప్రముఖ నటుడు జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షో రెండో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమానికి తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అతిథిగా హాజరయ్యారు. తాజాగా విడుదలైన ఈ ఎపిసోడ్ ప్రోమో ఆసక్తికరంగా సాగుతూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
Nara Lokesh | ప్రముఖ నటుడు జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షో రెండో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమానికి తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అతిథిగా హాజరయ్యారు. తాజాగా విడుదలైన ఈ ఎపిసోడ్ ప్రోమో ఆసక్తికరంగా సాగుతూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గురించి లోకేష్ చేసిన వ్యాఖ్యలు, ఆయన చెప్పిన డైలాగ్ ప్రోమోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రోమో ప్రారంభంలోనే నారా లోకేష్ ‘జై బాలయ్య’ అంటూ సందడి చేశారు. ఆ తర్వాత తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.
పాఠశాల రోజుల్లో తనకు ఎక్కువగా దెబ్బలు పడ్డాయని సరదాగా చెప్పుకొచ్చారు. దీంతో ఈ కార్యక్రమంలో లోకేష్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించబోతున్నారా? అనే ఆసక్తి నెలకొంది. ఈ షోలో నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది. బాలయ్య బాబు ఒకే ఒక్కరికి భయపడతారని చెబుతూ ఓ ఆసక్తికర విషయాన్ని ప్రస్తావించారు. అయితే, కామెంట్ వెనుక పూర్తి వివరాలు ఎపిసోడ్‌లోనే తెలియనున్నాయి. ఇక ప్రోమో చివర్లో బాలకృష్ణ సినిమాలోని ‘ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు’ అనే ప్రసిద్ధ డైలాగ్‌ను లోకేష్ చెప్పి ఆకట్టుకున్నారు. ఆయన చెప్పిన ఈ డైలాగ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. పూర్తి ఎపిసోడ్లో బాలయ్య గురించి ఇంకా ఏం మాట్లాడారు? తన చిన్ననాటి జ్ఞాపకాలతో పాటు ఎలాంటి విషయాలను పంచుకున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది.
‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్లో భాగంగా రూపొందిన నారా లోకేష్ ఎపిసోడ్ నవంబర్ 6 నుంచి జీ5 ఓటీటీలో ప్రసారం కానుంది. అలాగే నవంబర్ 8న రాత్రి 7.30 గంటలకు జీ తెలుగు ఛానల్లో టెలికాస్ట్ కానుంది.రాజకీయాల్లో బిజీగా ఉండే నారా లోకేష్ వినోదాత్మక టాక్ షోలో పాల్గొనడం, బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఈ ఎపిసోడ్‌పై అంచనాలను పెంచుతోంది. ప్రోమోతో ఆసక్తి రేకెత్తించిన ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nara Lokesh | ‘జై బాలయ్య’ అంటూ నారా లోకేష్ సందడి.. జగపతిబాబు షోలో బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు!
Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ సొంతింటి పేరు ఏంటో తెలుసా..తన జీవితాన్ని మార్చిన సినిమా పేరే పెట్టుకుంది!
Love Makthal’ | ‘లవ్ మక్తల్’ బోర్డును శుభ్రం చేసిన బీఆర్ఎస్ నాయకులు
Bhargav Desh Pande | రేవంత్ రెడ్డి చుట్టున్న నలుగురు తప్ప ఎవరూ బాగుపడలేదు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
KAAKA | చిరంజీవి ‘కాకా’లో బాలీవుడ్ స్టార్ హీరో .. కీలక పాత్రపై ఆసక్తికర చర్చ!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

