అగ్ర హీరో నాని ‘ది ప్యారడైజ్’ ప్రపంచాన్ని వీక్షించేందుకు సినీప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బ్లాక్‌బస్టర్ ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే విడుదల ఆలస్యం అవుతుండటంతో అభిమానులు మాత్రం కాస్తంత నిరాశగానే ఉన్నారు. మొన్నటివరకూ విడుదల తేదీలను ప్రకటించిన చిత్రబృందం ప్రస్తుతం మౌనంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది.
ప్రస్తుతం ఈ సినిమాకు చెందిన ైక్లెమాక్స్‌ను భారీ హంగులతో శ్రీకాంత్ ఓదెల చిత్రీకరిస్తున్నారట. ఇది పూర్తయ్యాక, ఓ ఐటమ్ సాంగ్ షూట్ కూడా ఉంటుందట. ఈ రెండూ పూర్తయ్యాకే విడుదల తేదీ ప్రకటిస్తారని వినికిడి. కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో డా.మోహన్‌బాబు కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్, నిర్మాత: సుధాకర్ చెరుకూరి, నిర్మాణం: ఎస్ఎల్వీ సినిమాస్.