ఎమోషనల్ లవ్‌స్టోరీకి సిద్ధం
గత రెండేళ్లుగా వరుస యాక్షన్ సినిమాలతో సందడి చేస్తూ వచ్చారు హీరో నాని. దసరా, హిట్ 3, ది ప్యారడైజ్.. ఇలా మాస్ యాక్షన్ మోడ్‌లో ఆయన చేసిన సినిమాలన్నీ భారీ విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో నటిస్తున్న ‘బ్లడీరోమియో’ సినిమాలో కూడా కొంతమేర యాక్షన్ ఉంటుందని తెలుస్తున్నది. ఇదిలావుంటే.. ఈ సినిమా తర్వాత నుంచి కథల ఎంపిక విషయంలో నాని పంథా మార్చనున్నారట.
గత రెండేళ్లుగా వరుస యాక్షన్ సినిమాలతో సందడి చేస్తూ వచ్చారు హీరో నాని. దసరా, హిట్ 3, ది ప్యారడైజ్.. ఇలా మాస్ యాక్షన్ మోడ్‌లో ఆయన చేసిన సినిమాలన్నీ భారీ విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో నటిస్తున్న ‘బ్లడీరోమియో’ సినిమాలో కూడా కొంతమేర యాక్షన్ ఉంటుందని తెలుస్తున్నది. ఇదిలావుంటే.. ఈ సినిమా తర్వాత నుంచి కథల ఎంపిక విషయంలో నాని పంథా మార్చనున్నారట. యాక్షన్ కథలను పక్కనపెట్టి, మనసుల్ని మెలిపెట్టే భావోద్వేగపూరితమైన కథాంశాలపై ఆయన దృష్టిసారించనున్నట్టు అంతరంగిక వర్గాల భోగట్ట.
ఈ క్రమంలోనే మధురమైన జ్ఞాపకాలను, చెప్పుకోలేని భావాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించే తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ఆయన ఓ ఎమోషనల్ ప్రేమకథలో నటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. 96, సత్యం సుందరం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు డైరెక్టర్ ప్రేమ్ కుమార్. త్వరలో ఆయన నానితో చేయబోతున్న సినిమా కూడా భావోద్వేగాల మేళవింపుగా ఉంటుందని సమాచారం. ఈ ఎమోషనల్ లవ్‌స్టోరీలో కథానాయిక పాత్ర కీలకమని టాక్. అందుకే ఆ పాత్ర కోసం చాలామంది కథానాయికలను పరిశీలించిన చిత్రబృందం చివరకు రుక్మిణి వసంత్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన రావాల్సివుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

