Nani | నానితో రొమాన్స్ చేయబోతున్న గోల్డెన్ బ్యూటీ.. ‘బ్లడీ రోమియో’లో లక్కీ ఛాన్స్ ?
Nani | నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ను క్రియేట్ చేసుకుంటున్నారు. కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ.. కొత్త దర్శకులతో ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందుండే నాని, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘ఓజీ’ ఫేమ్ దర్శకుడు సుజీత్‌తో నాని కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే.
Nani | నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ను క్రియేట్ చేసుకుంటున్నారు. కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ.. కొత్త దర్శకులతో ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందుండే నాని, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘ఓజీ’ ఫేమ్ దర్శకుడు సుజీత్‌తో నాని కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.నాని–సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ సినిమా ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సినిమాలో నానికి జోడీగా టాలీవుడ్లో ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరిని తీసుకునే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం.
హర్యానాకు చెందిన మీనాక్షి చౌదరి మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టారు. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమెకు ‘హిట్ 2’ మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత వరుసగా కీలక అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్లో తన స్థాయిని పెంచుకున్నారు.‘గుంటూరు కారం’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘లక్కీ భాస్కర్’ వంటి చిత్రాలతో మీనాక్షి చౌదరి మంచి విజయాలను అందుకున్నారు. దీంతో ఆమెకు టాలీవుడ్లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం నాగచైతన్యతో ‘వృషకర్మ’లో నటిస్తున్న ఈ భామకు ఇప్పుడు నాని సరసన నటించే అవకాశం దక్కితే అది ఆమె కెరీర్లో మరో కీలక అడుగుగా మారే అవకాశం ఉంది.
ఇక నాని–సుజీత్ సినిమా కథాంశం కూడా చాలా కొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. యూకేలోని ఫుడ్ మాఫియా నేపథ్యంలో డార్క్ హ్యూమర్, యాక్షన్ అంశాలను కలిపి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. గ్యాంగ్‌స్టర్ ప్రపంచానికి సంబంధించిన కథలో నాని ఇప్పటివరకు కనిపించని సరికొత్త పాత్రలో కనిపించనున్నారని టాక్. నాని పాత్రలో చెఫ్‌కు సంబంధించిన షేడ్స్‌తో పాటు గ్యాంగ్‌స్టర్ తరహా లక్షణాలు కూడా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఒకే పాత్రలో విభిన్న కోణాలను చూపించే విధంగా సుజీత్ కథను సిద్ధం చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. నాని, సుజీత్, పృథ్వీరాజ్ కాంబినేషన్‌కు తోడు మీనాక్షి చౌదరి కూడా భాగమైతే ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని 2027 వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

