Nani The Paradise | నాని ది ప్యారడైజ్‌పై రూమర్స్.. జోకర్లు అంటూ ఘాటు స్పందన
Nani The Paradise | నేచురల్ స్టార్ నాని ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. నటుడిగా నిర్మాతగా మంచి విజయాలు అందుకుంటున్నాడు. ఇటీవల నాని నిర్మించిన కోర్ట్ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు
Nani The Paradise | నేచురల్ స్టార్ నాని ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. నటుడిగా నిర్మాతగా మంచి విజయాలు అందుకుంటున్నాడు. ఇటీవల నాని నిర్మించిన కోర్ట్ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ప్రస్తుతం హిట్ 3, ది ప్యారడైజ్ అనే చిత్రాలు చేస్తున్నాడు. ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ది ప్యారడైజ్- రా స్టేట్మెంట్ మూవీ తెరకెక్కుతుండగా, ఈ మూవీ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ గ్రిప్పింగ్ టీజర్ రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ సంపాదించి, తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిధిని రీడిఫైన్ చేసింది .మార్చి 26, 2026న ది ప్యారడైజ్ తెరపైకి రానుంది. వార్ బ్యాక్‌డ్రాప్‌లో మూవీ ఉంటుందని అర్ధమవుతుంది.
పోస్టర్లో తుపాకీని పట్టుకుని ఉన్న నానిని చూసి ఫ్యాన్స్ థ్రిల్ అయిపోయారు. చిత్రం ఫ్యాన్స్‌కి కనుల పండుగగా ఉంటుందని ముచ్చటించుకుంటున్నారు. . ఎస్ఎల్వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇంగ్లీష్, స్పానిష్ సహా 8 భాషలలో విడుదల కానుంది. ఈ చిత్రం పై పలు షాకింగ్ పుకార్లు వినిపించడం మొదలయ్యాయి. పలు రూమర్స్ వైరల్ చేస్తున్న నేపథ్యంలో మేకర్స్ నుంచే ఊహించని ఘాటు రిప్లై వచ్చింది. తమ సినిమాపై ఇలా వార్తలు స్ప్రెడ్ చేస్తున్న జోకర్స్ అందరికీ సమాధానం తమ సినిమా తోనే చెప్తామని అంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారు అందరికీ కూడా సమయం దగ్గరలోనే ఉంది అన్నట్టు వార్నింగ్ ఇస్తున్నారు.
ఇక తమ సినిమా టాలీవుడ్ లోనే ఒక గ్రేటెస్ట్ సినిమా కాబోతోంది. అన్ని విభాగాల్లో టెక్నీషియన్స్ ప్రాణం పెట్టి పని చేస్తున్నారు. మేము ఈ ప్రౌడ్ సినిమా చేస్తున్నాము అంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అని ది ప్యారడైజ్ టీం చెప్పుకొచ్చింది. అయితే ది ప్యారడైజ్ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందని వార్తలు వస్తున్నాయి. మొదటి భాగం వచ్చే ఏడాది మార్చి 26న, రెండో పార్ట్ ఆ తర్వాత రిలీజ్ అవుతుందని టాక్. ఫుల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతుంది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్, స్పానిష్ లాంటి విదేశీ భాషల్లోనూ ఒకేసారి విడుదల కానుంది. సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే కథ ఇది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- jokers
- Nani
- NANI THE PARADISE
RELATED ARTICLES
తాజా వార్తలు
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ఉపాధి కోసం ఆంధ్రా వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
మోటకొండూర్‌లో రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

