తనే నా ఫస్ట్ క్రష్
హీరో నానికి లేడీ ఫాలోయింగ్ ఎక్కువ. చాలామంది అమ్మాయిలకు ఆయన క్రష్. కానీ తన ఫస్ట్ క్రష్ ఎవరు? అనే విషయం మాత్రం ఇంతవరకూ ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు నాని.
హీరో నానికి లేడీ ఫాలోయింగ్ ఎక్కువ. చాలామంది అమ్మాయిలకు ఆయన క్రష్. కానీ తన ఫస్ట్ క్రష్ ఎవరు? అనే విషయం మాత్రం ఇంతవరకూ ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు నాని. రీసెంట్గా తన ‘హాయ్ నాన్న’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తన ఫస్ట్ క్రష్ గురించి మాట్లాడాడు నాని. “మెచ్యూరిటీ లెవల్స్ లేని రోజుల్లో అందంగా ఏ అమ్మాయి కనిపించినా తెలీని అదోరకమైన ఫీలింగ్. నిజానికి అది అట్రాక్షన్. ఆ ప్రేమ అనుకునే అట్రాక్షన్‌ని మూడో తరగతిలోనే ఫేస్ చేశాను.
అప్పుడు మా స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటేషన్ పెట్టారు. మొలదాకా ఆకులు కట్టుకొని ఆ కాంపిటేషన్‌లో పాల్గొన్నాను. అప్పుడు అందమైన గౌను వేసుకొని ఓ అమ్మాయి వచ్చింది. తన పేరు సోని. తనే నా ఫస్ట్ క్రష్. అయితే సిగ్గుతో అప్పుడు మాట్లాడలేకపోయా. తనిప్పుడు కనిపిస్తే మాత్రం కచ్ఛితంగా వెళ్లి పలకరిస్తా. మంచి డ్రెస్‌లో ఉన్నా కదా” అంటూ నవ్వేశారు నాని.
ఇంకా చెబుతూ “ ప్రేమ అనే కాన్సెప్ట్ లోతైంది. దాని గురించి తెలుసుకోవాలంటే పరిపక్వత అవసరం. ఎదిగిన బిడ్డగా, తండ్రిగా, భర్తగా అసలు ప్రేమంటే ఏంటో ఇప్పుడు తెలుస్తున్నది. ఈ సందర్భంగా నా ప్రజెంట్ క్రష్ గురించి కూడా చెప్పాలనుంది. తనెవరో కాదు.. కియరా ఖన్నా. ‘హాయ్ నాన్న’లో నా కూతురు. షూటింగ్ టైమ్‌లో ఆ పాపను చూసినప్పుడల్లా… తను నాకూతురే అయితే ఎంత బావుండో అనిపించేది. చక్కగా రెడీ అయ్యి సెట్‌కి వచ్చేది. ఎంత ముచ్చటగా ఉండేదో” అంటూ చెప్పుకొచ్చారు నాని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robbery | పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఫ్యామిలీ.. రాత్రి కారులో హైదరాబాద్‌కు తిరిగొస్తుంటే..
Malaria vaccine | మలేరియా టీకా ధరలు తగ్గింపు.. మరో 10 లక్షల మంది పిల్లలకు రక్షణ..!
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

