ప్రతీ సినిమాలో నటుడిగా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంటారు హీరో నాని. ఇటీవల ‘ది ప్యారడైజ్’ చిత్రంలో మాస్ అవతారంలో ఆయన ప్రేక్షకుల్ని మెప్పించారు. ప్రస్తుతం ఆయన గ్యాంగ్స్టర్ రొమాంటిక్ డ్రామా ‘బ్లడీ రోమియో’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇది పూర్తయిన తర్వాత తాను పూరిస్థాయి ప్రేమకథా చిత్రంలో నటించబోతున్నట్లు నాని తెలిపారు.
‘ఈ సినిమా స్వీట్లవ్స్టోరీగా ఉంటుంది. పిల్లలు కూడా చూసి ఎంజాయ్ చేసేలా చక్కటి వినోదం, సున్నితమైన అంశాలతో రూపొందించబోతున్నాం’ అని నాని తెలిపారు. అయితే ఈ సినిమాకు దర్శకుడెవరనే విషయాన్ని నాని వెల్లడించలేదు. ఆయన నటించిన పీరియాడిక్ చిత్రం ‘ది ప్యారడైజ్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 170కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది.