పోసాని భౌతిక కాయం ముందు బిగ్ బాస్ బ్యూటీ డ్యాన్స్

శవం ముందు డాన్స్ చేయడం అది కామన్. చాలాసార్లు జరుగుతుంది. అయితే దాని కోసం ప్రత్యేకంగా కొందరు ఉంటారు. వాళ్లు చేసినప్పుడు మాత్రమే అది అందంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక హీరోయిన్ డెడ్ బాడీ ముందు నిలబడి డాన్స్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదేం పిచ్చి రా బాబు.. శవం ముందు పెట్టుకొని వెర్రి డాన్సులు చేస్తున్నారు. ఏదైనా పని చేసే ముందు కనీసం ఆలోచించరా.. ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటూ ఆమెపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
అలా శవం ముందు డాన్స్ చేసిన ఆ హీరోయిన్ ఎవరో కాదు.. నందిని రాయ్. బిగ్ బాస్ షో పుణ్యమాని బాగానే పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఆహా వేదికగా వస్తున్న వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. ఇప్పటికే అందులో రెండు భారీ వెబ్ సిరీస్ చేసింది నందిని రాయ్. దాంతో పాటు మరి కొన్ని సినిమాలు కూడా చేస్తుంది. బుల్లితెరపై కూడా బిజీగానే ఉంది నందిని రాయ్. తాజాగా ఈమె పోస్ట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మధ్యే ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ వెబ్ సిరీస్ లో నటించింది నందిని.
అందులో పోసాని కృష్ణమురళి భార్యగా ఈమె కనిపించింది. ఆ వెబ్ సిరీస్ లో పోసాని చచ్చిపోతాడు. ఆ సన్నివేశం షూట్ చేస్తున్నప్పుడు ఆఫ్ కెమెరాలో డాన్సులు ఇరగదీసింది నందిని రాయ్. ముందు పోసాని శవం ఉంటే గనుక ఆమె డాన్సులు చేయడం వైరల్ అవుతుంది. ఫన్ ఆన్ ది సెట్స్ అంటూ వీడియో పోస్ట్ చేసింది నందిని. ప్రస్తుతం ఇది చాలా వైరల్ అవుతుంది. కొందరు ఈ వీడియోను సరదాగా తీసుకుంటే.. మరికొందరు మాత్రం ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు ఎందుకు పెడతారు అంటూ నేరుగానే విమర్శిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

