NKRAR2 | నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మల్టీస్టారర్ మూవీ #VenkyAnil5 (#NKRAR2) నుండి అదిరిపోయే ఫస్ట్‌లుక్ అప్డేట్ వచ్చేసింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా విడుదలైన బర్త్‌డే స్పెషల్ పోస్టర్లో కళ్యాణ్ రామ్ కంప్లీట్ సాంప్రదాయ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. షైన్ స్క్రీన్స్, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, కీర్తి సురేష్, కృతి శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా కళ్యాణ్ రామ్‌కు విషెస్ చెప్తూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. తన మొదటి సినిమా ‘పటాస్’ అవకాశం ఇచ్చి, డెబ్యూ డైరెక్టర్‌గా తనపై నమ్మకం ఉంచిన మొదటి హీరో, తన బెస్ట్ బడ్డీ అయిన కళ్యాణ్ రామ్‌కు థాంక్స్ చెబుతూ.. ఈ సినిమాలో ఆయన్ని సరికొత్త అవతారంలో చూపించబోతున్నందుకు ఎగ్జైటింగ్‌గా ఉందన్నారు. అలాగే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌తో 2027 సంక్రాంతి పండగను థియేటర్లలో మరింత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుందామంటూ అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. ‘పటాస్’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడం, పైగా వెంకటేష్ కూడా తోడవ్వడంతో ఈ సంక్రాంతి రేసు మరింత రసవత్తరంగా మారనుంది.
Wishing my first hero, and one of my best buddies @NANDAMURIKALYAN garu, a very Happy Birthday🤗
I will always be grateful for the confidence you placed in me as a debut director, and I’m truly excited to present you in a whole new avatar with #VenkyAnil5 #NKRAR2, Sir.😀
Let’s… pic.twitter.com/ACOKAjASZE
— Anil Ravipudi (@AnilRavipudi) July 5, 2026