Virata Parvam | ‘విరాటపర్వం’ నుంచి ‘నగాదారిలో’ సాంగ్ విడుదల.. ఆకట్టుకుంటున్న సోల్‌ఫుల్ ట్యూన్!
Virata Parvam | పాత్ర నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేయడానికి సిద్ధంగా ఉండే అతికొద్ది మంది నటులలో రానా దగ్గుబాటి ఒకడు. మొదటి నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ అటు హీరోగా ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీరంగంలో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈయన నటించిన ‘భీమ్లానాయక్’ విడుదలై ఘన విజయం సాధించింది. ఇందులో రానా నటనకు ప్రేక్షకులతో పాటు సినీ క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. అయితే రానా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. గతేడాది ప్రథమార్థంలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది.
అయితే ఇటీవలే చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించింది. ఈ చిత్రం జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ తరచూ ఏదో ఒక అప్డేట్ను ప్రకటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నగాదారిలో’ పాటను మేకర్స్ విడుదల చేశారు. ద్యావరి నరేందర్ రెడ్డి, సనపాటి భరద్వాజ్ సాహిత్యం అందించిన ఈ పాటను వరం ఆలపిచింది. సురేష్ బొబ్బిలి స్వర పరిచిన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఉత్తర తెలంగాణలో 1990లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ‘నీదినాది ఓకేకథ’ ఫేం వేణు ఊడుగుల దర్శకత్వం వహించాడు. సాయిపల్లవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ప్రియమణి కీలకపాత్రలో నటించింది. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

