నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. కార్తీక్ దండు దర్శకుడు. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మాతలు. మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాల కలబోతగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా గురువారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ చిత్రంలో నాగచైతన్య ట్రెజర్ హంటర్‌గా పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన మేకోవర్ సరికొత్తగా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉందని, అత్యుత్తమ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని మేకర్స్ తెలిపారు. మీనాక్షి చౌదరి, స్పర్ష్ శ్రీవాస్తవ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ బి లోక్‌నాథ్, దర్శకత్వం: కార్తీక్ దండు.