Ramarao On Duty | ‘నా పేరు సీసా’ సాంగ్ విడుదల.. మాస్ స్టెప్స్‌తో అదరగొడుతున్న బాలీవుడ్ బ్యూటీ
Naa Peru Seesa Song | మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. కెరీర్లో ఎప్పుడు లేనంత స్పీడ్‌గా షూటింగ్‌లను పూర్తి చేస్తూ.. ఏడాదికి రెండు సినిమాలను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈయన సినిమాల నుంచి వస్తున్న అప్డేట్స్ ఏ హీరో సినిమాల నుంచి కూడా రావడంలేదు. ప్రతి వారం ఏదో ఒక అప్డేట్తో రవితేజ.. అభిమానులను ఖుషి చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇటీవలే ‘ఖిలాడీ’తో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన మాస్రాజ ఈ సారి ‘రామారావు ఆన్ డ్యూటీ’తో ఎలాగైనా మంచి హిట్టు సాధించాలని కసితో ఉన్నాడు. ఈ చిత్రంతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 29న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ఇస్తుంది. తాజాగా ఈ చిత్రంలోని మాస్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
నా పేరు సీసా అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్‌ను శ్రేయఘోషల్ ఆలపించింది. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించాడు. లేటెస్ట్గా విడులైన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. సామ్ సీ.ఎస్ స్వర పరిచిన ఈ పాట కొత్తగా, క్యాచీగా ఉంది. బాలీవుడ్ బ్యూటీ అన్వేషి జైన్ ఈ ఐటెం సాంగ్‌లో నర్తించింది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ‘బుల్ బుల్ తరంగ్’, ‘సొట్ట బుగ్గల’ సాంగ్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. రవితేజకు జోడీగా ఈ చిత్రంలో దివ్యాంక కౌశిక్, రాజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. చాలా కాలం తర్వాత సీనియర్ నటుడు వేణు తోట్టెంపూడి ఈ చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. శ్రీ లక్ష్మివెంకటేశ్వరా సినిమాస్, ఆర్టి టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరితో కలిసి రవితేజ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా కనిపించబోతున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

