NTR Neel | ఆ వార్తల్లో నిజం లేదు.. ఎన్టీఆర్-నీల్ మూవీ షూటింగ్ రద్దుపై క్లారిటీ ఇచ్చిన టీమ్
NTR Neel | యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
NTR Neel | యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ రద్దు అయిందని, ఎన్టీఆర్ కొత్త లుక్ విషయంలో సంతృప్తిగా లేకపోవడంతో షెడ్యూల్స్ నిలిపివేశారనే వార్తలు వైరల్ కావడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఈ పుకార్లపై నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా స్పందిస్తూ గట్టి క్లారిటీ ఇచ్చింది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి వస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని, సినిమా షూటింగ్ రద్దు కాలేదని మైత్రీ స్పష్టం చేసింది. అంతేగాకుండా ప్రస్తుతం జరుగుతున్న గ్యాప్ కేవలం తదుపరి భారీ షెడ్యూల్ కోసం అవసరమైన సన్నాహాల కోసం తీసుకున్నదే తప్ప, మరే ఇతర కారణాలు లేవని తేల్చి చెప్పింది. ఎన్టీఆర్ లుక్ గురించి వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని, అంతా ముందే అనుకున్న ప్లాన్ ప్రకారమే సాగుతోందని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దని, ఏదైనా సమాచారం ఉంటే అధికారికంగా తామే ప్రకటిస్తామని మేకర్స్ విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే ఈ చిత్రం జోర్డాన్ వంటి ప్రాంతాల్లో కీలక షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. ఈ మాస్ యాక్షన్ డ్రామా కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా యుద్ధ విద్యల్లో శిక్షణ పొందడమే కాకుండా, తన బాడీ లాంగ్వేజ్‌ను కూడా పూర్తిగా మార్చుకుంటున్నట్లు సమాచారం. కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై అటు టాలీవుడ్, ఇటు శాండల్‌వుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. నిర్మాణ సంస్థ ఇచ్చిన ఈ అధికారిక వివరణతో గత కొద్దిరోజులుగా జరుగుతున్న అసత్య ప్రచారాలకు తెరపడినట్లయింది. ప్రస్తుతం ఈ భారీ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర బృందం సిద్ధమవుతోంది.
There is absolutely no truth to the rumours circulating about the look or any schedule cancellation. The film is progressing as planned, with only a routine preparation gap. We request everyone not to believe or spread unverified information. Official updates will always come…
— Mythri Movie Makers (@MythriOfficial) April 8, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

