ముత్తయ్య బయోపిక్ 800
ప్రముఖ క్రికెటర్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ శ్రీలంక క్రికెటర్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘800’. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్నది. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్ డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టర్ నటిస్తున్నారు.
ప్రముఖ క్రికెటర్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ శ్రీలంక క్రికెటర్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘800’. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్నది. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టర్ నటిస్తున్నారు. ఆయన భార్య మదిమలర్ పాత్రలో మహిమ నంబియార్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎస్ శ్రీపతి దర్శకులు. బుకర్ ప్రైజ్ (2022) పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ అందించారు. కాగా ఈ చిత్రం ఆలిండియా పంపిణీ హక్కులు నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్నారు.
తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నారు. శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ‘ముత్తయ్య మురళీధరన్ నిజ జీవితంలో ఆయన ఎదుర్కొన్న, ఎన్నో సంఘటనలు, ఎత్తుపల్లాలు భావోద్వేగభరితంగా ఈ చిత్రంలో వుంటాయి. బాల్యం నుంచి ఆయన జీవిత ప్రయాణం అంతా ఈ చిత్రంలో వుంటుంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

