Mahesh Babu | ‘ముఫాసా’కి మహేష్ బాబు గొంతు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘లయన్ కింగ్’ తెలుగు ట్రైలర్
Mufasa The Lion King | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు హాలీవుడ్ విజువల్ వండర్ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa The Lion King) తెలుగు వెర్షన్‌కు డబ్బింగ్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
Mufasa The Lion King | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు హాలీవుడ్ విజువల్ వండర్ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa The Lion King) తెలుగు వెర్షన్‌కు డబ్బింగ్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ది లయన్ కింగ్’ సినిమాకు ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa The Lion King) అంటూ ప్రీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయగా.. యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది.
లయన్ కింగ్ సినిమాకు ఇండియాలో కూడా ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. ది లయన్ కింగ్ చిత్రం ఇండియాలో మంచి కలెక్షన్లు సాధించింది. అయితే ఈ సినిమాకు తెలుగుతో పాటు హిందీ తదితర భాషల్లో అక్కడి నటులతో డబ్బింగ్ చెప్పిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే హిందీలో షారుఖ్ ఖాన్ ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పగా.. తాజాగా తెలుగులో అగ్రకథానాయకుడు మహేశ్ బాబు తన గాత్రాన్ని అందించారు. ఈ మూవీలో అడవి రాజు అయిన ముఫాసా పాత్రకు మహేశ్ డబ్బింగ్ చెప్పగా.. పుంబా కోసం బ్రహ్మానందం, టిమోన్ పాత్ర కోసం అలీ తమ వాయిస్‌ను అందిస్తున్నారు. తాజాగా తెలుగు వెర్షన్‌కు సంబంధించిన ట్రైలర్‌ను మహేశ్ బాబు ఎక్స్ వేదికగా విడుదల చేశారు. తెలుగులో ముఫాసా పాత్రకు వాయిస్‌ని అందించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు చాలా ప్రత్యేకమైనది అంటూ ప్రిన్స్ రాసుకోచ్చాడు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మొదటి రెండు (The Lion King) పార్ట్‌లలో అడవికి రారాజుగా ఉన్న ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉండడం అతడికి సింబా అనే కుమారుడు జన్మించడం చూడవచ్చు. అయితే ఈ ప్రీక్వెల్‌లో ముఫాసా అడవికి రాజుగా అసలు ఎలా ఎదిగాడు అతడికి సోదరుడు ఉన్న టాకా ఎలా చనిపోయాడు. అలాగే ముఫాసా చంపాలని చూస్తున్నా స్కార్ ఏం చేశాడు అనేది సినిమా స్టోరీ. ఫొటో రియలిస్టిక్ టెక్నాలజీతో వస్తున్న ఈ సినిమాకు అకాడమీ అవార్డ్ విజేత బేరీ జెంకిన్స్ దర్శకుడు ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
A new dimension to the character we know and love! Extremely excited to be the voice of Mufasa in Telugu and having been a massive fan of the classic, this is a special one for me!
Long live the king ♥️@DisneyStudiosIN pic.twitter.com/9LdAX6qexT
— Mahesh Babu (@urstrulyMahesh) August 26, 2024
Also Read..
- KTR | రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి.. కేటీఆర్ ట్వీట్
- BJP | జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు.. 44 అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ
- DSC 2008 | నిరసనలు వద్దు.. వచ్చి కలవండి.. డీఎస్సీ 2008 బాధితుల వినూత్న నిరసన
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

