Akhil: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రికార్డ్.. రూ. 50 కోట్ల క్లబ్లో అఖిల్ చిత్రం

అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాల తర్వాత అఖిల్ నటించిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్, రొమాంటిక్ ఫీల్‌గుడ్ మూవీ లో పూజా హెగ్డే(Pooja Hegde) కథానాయికగా నటించింది. దసరా సందర్భంగా అక్టోబర్ 15న విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు నుంచి మంచి టాక్ వచ్చింది.
అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు – వాసు వర్మ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించగా, తాజాగా ఈ సినిమా రూ.50 కోట్ల క్లబ్లో చేరింది. అఖిల్ కెరీర్లో మొదటి 50 కోట్ల సినిమా ఇదే కావటం విశేషం. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతకు కూడా ఈ చిత్రం ఎంతో బాగా నచ్చింది. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే కెమిస్ట్రీకి తోడు గోపీ సుందర్ మ్యూజిక్ సినిమా సక్సెస్ లో భాగం అయింది.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్(Most Eligible Bachelor) సినిమాకు 19.71 కోట్ల బిజినెస్ జరిగింది. 16 రోజుల్లోనే ఈ చిత్రం 23.42 కోట్లకు పైగా షేర్ వసూలు చేయటంతో అన్నిచోట్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వచ్చేసారు. మొత్తంగా రూ. 4.5 కోట్ల లాభాలు తీసుకొచ్చారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అంటున్నారు. అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమా చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diksha Divas | ముఖ్రా (కె) గ్రామంలో ఒకరోజు ముందే దీక్షా దివస్.. కేసీఆర్ చిత్రపటానికి పూలు, పాలతో అభిషేకం.. Video
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

