Moana Official Telugu Trailer | ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనం హాలీవుడ్ యానిమేషన్ చిత్రం ‘మోవానా’ ఇప్పుడు సరికొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2016లో విడుదలై సూపర్ హిట్ అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు లైవ్-యాక్షన్‌గా రాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూలై 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా మూవీ నుంచి తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
‘మోవానా’కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో, ఒరిజినల్ వెర్షన్లో మౌయి పాత్రకు గొంతు అందించిన డ్వేన్ జాన్సన్ ఇప్పుడు నేరుగా అదే పాత్రలో వెండితెరపై కనిపించడం విశేషం. తాజాగా విడుదలైన ట్రైలర్లో ఆయన మేకోవర్, పొడవైన జుట్టు మరియు ఒంటి నిండా టాటూలతో ఉన్న లుక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో మోవానా పాత్రలో 17 ఏళ్ల నూతన నటి కాథరిన్ లగాయ తన నటనతో ఆకట్టుకోగా, సముద్రపు అలల మధ్య సాగే అద్భుతమైన విజువల్స్ మరియు గ్రాఫిక్స్ హాలీవుడ్ స్థాయిలో అత్యంత రిచ్‌గా ఉన్నాయి. థామస్ కైల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు లిన్-మాన్యుయెల్ మిరాండా సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. తన ద్వీపాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి ఒక ధైర్యవంతురాలైన అమ్మాయి మౌయి సహాయంతో చేసే సాహసయాత్రే ఈ చిత్ర కథాంశం.