Mission Raniganj Movie | ఆస్కార్ రేసులో అక్షయ్‌కుమార్ మిషన్ రాణిగంజ్ సినిమా..!
Mission Raniganj Movie | అక్షయ్ కుమార్ ఫ్లాపుల పరంపరను 'మిషన్ రాణిగంజ్' కంటిన్యూ చేస్తుంది. వారం కిందట రిలీజైన ఈ సినిమాకు పాజిటీవ్ రివ్యూలే వచ్చాయి. కానీ కలెక్షన్లు మాత్రం అట్టడుకు వెళ్లాయి.
Mission Raniganj Movie | అక్షయ్ కుమార్ ఫ్లాపుల పరంపరను ‘మిషన్ రాణిగంజ్’ కంటిన్యూ చేస్తుంది. వారం కిందట రిలీజైన ఈ సినిమాకు పాజిటీవ్ రివ్యూలే వచ్చాయి. కానీ కలెక్షన్లు మాత్రం అట్టడుకు వెళ్లాయి. తొలిరోజు కేవలం కోటికి పైగా షేర్‌ను మాత్రమే రాబట్టి.. అక్షయ్ కుమార్ కెరీర్లో లోయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పటివరకు ఈ సినిమా పట్టుమని పది కోట్ల షేర్‌ను కూడా సాధించలేకపోయింది. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయినా.. క్రిటిక్స్ నుంచి గొప్ప ప్రశంసలు దక్కించుకుంది.
కాగా చిత్ర యూనిట్ ఈ సినిమాను ఆస్కార్ పోటీకి సిద్దం చేసింది. జనరల్ కేటగిరీలో ఇండిపెండెంట్‌గా ఆస్కార్ కోసం నామినేషన్ వేసింది. పశ్చిమ బెంగాల్‌లోని బొగ్గు గనిలో వరదలు వచ్చినప్పుడు జస్వంత్ సింగ్ గిల్ అనే ఒక ఇంజనీర్ 65 మంది కార్మికులను రక్షించాడు. ఆయన నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను టిను సురేశ్ దేశాయ్ తరకెక్కించాడు. కథ పరంగా.. ఎగ్జక్యూషన్ పరంగా ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. మరీ ఆస్కార్ బిరిలో ఏ మేరకు మెప్పుపొందుతుందో చూడాలి.
ఇక ఇండియా తరుపున మలయాళ సినిమా 2018 ఆస్కార్‌కు అధికారికంగా ఎంపికైంది. ఈ ఏడాది మే నెల తొలివారంలో రిలీజైన ఈ సినిమా అక్కడ రూ.150 కోట్ల మార్క్ టచ్ చేసి మలయాళ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆర్మీలో ఉద్యోగం మానేసి దుబాయ్ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న టోవినో థామస్. ప్రజల కష్టాలను ప్రపంచానికి చూపించే జర్నలిస్ట్ అపర్ణ బాలమురళి. ఓ పెద్ద మోడల్ కావడమే లక్ష్యంగా శ్రమిస్తున్న మత్య్సకార కుటుంబానికి చెందిన అసీఫ్ అలీ.
ప్రభుత్య కార్యాలయంలో పనిచేసే కుంచకో బొబన్. కేరళ సరిహద్దుల్లో ఉండే తమిళనాడు గ్రామానికి చెందిన లారి డ్రైవర్ కలైయారస్ టూరిస్ట్‌లకి గైడ్‌గా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్న అజు వర్ఘీస్. ఇలా ఎవరి జీవితాల్లో వారు వారి పనుల్లో బిజీగా ఉంటారు. అలా జీవితాన్ని కొనసాగిస్తన్న వీళ్ల లైఫ్‌లోకి అనూహ్యమైన పరిణామం చోటుచేసుకుంటుంది. అదే కేరళ వరదలు. ఆ సమయంలో ఒకరికొకరు ఎలా అండగా నిలబడ్డారు. వరదల్లో చిక్కుకున్న వారిని ఎలా కాపాడారు అనే కథాంశంతో ఈసినిమా తెరకెక్కింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్‌లో చెలరేగిన హింస.. 1000 మంది అరెస్ట్.. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్ల ప్రయోగం
AP News | రానున్న ఐదు రోజులు అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు ఏపీ హోంమంత్రి ఆదేశం..!
CULT Title | సూర్య సినిమా కోసం ‘కల్ట్’ టైటిల్ అడిగారు.. కానీ నేను ఇవ్వలేదు: విశ్వక్ సేన్
Rahul Gandhi | ‘మా ర్యాలీకి పబ్లిసిటీ చేస్తున్నందుకు థ్యాంక్స్’.. బీజేపీపై రాహుల్‌గాంధీ వ్యంగ్యాస్త్రాలు..!
Weekly Bus Pass | హైదరాబాద్ ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఇక ‘వీక్లీ బస్ పాస్’తో అపరిమిత బస్ ప్రయాణం
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

