రామ్‌కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. వాచస్పతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పంచుమర్తి నరేష్‌బాబు నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ఈ సినిమాలోని ‘పిల్ల పిల్ల పిల్ల..’ అంటూ సాగే తొలి గీతాన్ని ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు ఆవిష్కరించారు. ధృవన్ సంగీతంతో పాటు ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు.
థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో సాగే పరిశోధనాత్మక సినిమా ఇదని, కథానుగుణంగా అద్భుతమైన పాటలు కుదిరాయని దర్శకుడు వాచస్పతి తెలిపారు. సీట్ఎడ్జ్ థ్రిల్లర్ ఇదని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని సంగీత దర్శకుడు ఆర్.ఆర్.ధృవన్ పేర్కొన్నారు. గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఆర్.ఆర్.ధృవన్, కథ, స్క్రీన్‌ప్లే: వనరాజ్, దర్శకత్వం: వాచస్పతి.