Minister KTR | అద్భుతమైన సినిమా తీశావ్.. బలగం మూవీ డైరెక్టర్ వేణుకు మంత్రి కేటీఆర్ అభినందన
Minister KTR | బలగం సినిమా డైరెక్టర్ యెల్దండి వేణును మంత్రి కేటీఆర్ అభినందించారు. తాను ‘బలగం’ సినిమా చూశానని, అద్భుతంగా తీసినట్లు ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ మేరకు కలెక్టరేట్లో జరిగిన ఉత్తమ పంచాయతీలకు అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం అనంతరం, అక్కడికి వేణును ఆహ్వానించారు.
Minister KTR | బలగం సినిమా డైరెక్టర్ యెల్దండి వేణును మంత్రి కేటీఆర్ అభినందించారు. తాను ‘బలగం’ సినిమా చూశానని, అద్భుతంగా తీసినట్లు ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ మేరకు కలెక్టరేట్లో జరిగిన ఉత్తమ పంచాయతీలకు అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం అనంతరం, అక్కడికి వేణును ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనను మంత్రి స్వయంగా ఆలింగనం చేసుకుని, శాలువాతో సత్కరించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, అనుబంధాలను చక్కగా చూపించారని అభినందించారు. తక్కువ బడ్జెట్‌తో సమాజానికి దోహదపడేలా ‘బలగం’ లాంటి సినిమాలు తీయాలని, కమర్షియల్ సినిమాల వైపు ఇప్పుడే వెళ్లొద్దని వేణుకు సూచించారు. మంచి సినిమాలను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని, దీనికి ఉదాహరణ ‘బలగం’ సినిమానే అని పేర్కొన్నారు. తాను గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సినిమా భారీ విజయం కావడం సంతోషంగా ఉందన్నారు. తన నియోజవర్గానికి చెందిన వేణు సిరిసిల్ల ఖ్యాతిని ‘బలగం’ సినిమాతో పెంచారని ప్రశంసించారు. మంచి సినిమాలకు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని, వేణు భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు డైరెక్టర్ వేణు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రితో సెల్ఫీ తీసుకునేందుకు యత్నించగా, మంత్రి కేటీఆర్ స్వయంగా ఫోన్లో సెల్ఫీ తీసి ఇవ్వడం గమనార్హం. ఇక్కడ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్‌బాబు, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ ఉన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Pradesh | అగ్నిగుండంగా అరుణాచల్ ప్రదేశ్.. హైడ్రోపవర్ ప్రాజెక్టు వ్యతిరేక నిరసనల్లో హింసాకాండ!
Medigadda | నిరంతరం జలతరంగం.. మేడిగడ్డ వద్ద 20 వేల క్యూసెక్కుల ప్రవాహం
Jagadish Reddy | కన్నెపల్లికి పోదామా.. పంపులు ఆన్ చేస్తే నీళ్లు ఎందుకు రావో చూస్తా.. జగదీశ్ రెడ్డి సవాల్!
Random Trees | కేటీఆర్ స్ఫూర్తితో.. ర్యాండమ్ ట్రీస్.. అమెరికాలో ప్రారంభమై, పలు దేశాలకు సేవలందిస్తున్న కంపెనీ
RTC Land | ఆర్టీసీ జాగ.. సర్కార్ పాగా.. హౌసింగ్ బోర్డుకు రూ.వెయ్యి కోట్ల భూమి ఇస్తూ జీవో
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

