Stree-2 Movie | ‘స్త్రీ 2’ కోసం మిల్కీ బ్యూటీ స్పెషల్ సాంగ్.?
Stree-2 Movie | ఐదేళ్ల కిందట బాలీవుడ్లో ‘స్త్రీ’ సినిమా సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. కేవలం పదిహేను కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.180 కోట్ల రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టింది. కామెడీ హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా హిందీ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.
Stree-2 Movie | ఐదేళ్ల కిందట బాలీవుడ్లో ‘స్త్రీ’ సినిమా సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. కేవలం పదిహేను కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.180 కోట్ల రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టింది. కామెడీ హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా హిందీ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. రీసెంట్గా వచ్చిన ‘భేదియా’ మూవీ డైరెక్టర్ అమర్ కౌశికే స్త్రీ సినిమాను తెరకెక్కించాడు. అంతేకాకుండా ఆయనకు ఇది తొలిసినిమా. తొలి అడుగులోనే ఆ రేంజ్ హిట్ సాధించాడంటే ఆశా మాశీ కాదు. ఇక రాజ్‌కుమర్ రావు, శ్రద్ధా కపూర్ తమ తమ పర్ఫార్మెన్స్తో అదరిగొట్టేశారంతే. కీలక పాత్రలో పంకజ్ త్రిపాటి ఓ రేంజ్లో అవుట్ పుట్ ఇచ్చాడు. మొత్తంగా ఆ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా స్త్రీ నిలిచింది.
ఇక ఈ బ్లాక్ బస్టర్ మూవీకి ‘స్త్రీ 2’ అంటూ సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. ఈ సినిమాకు కూడా అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. ఇక ఈ ఏడాది ‘వా.. నువ్వు కావాలయ్యా’ అంటూ ‘జైలర్’ సినిమాలో రజనీకాంత్‌తో స్టెప్పులు వేసిన తమన్నా ఈ పాటతో మరోసారి తన డ్యాన్సుతో సందడి చేయడానికి ముస్తాబవుతుంది. ఈ విషయాన్ని మేకర్స్ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

