టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) లీడ్ రోల్లో నటించిన చిత్రం మైఖేల్. దివ్యాంశ కౌశిక్ ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించగా.. గౌతమ్ మీనన్, వరుణ్ సందేశ్, విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్‌కుమార్, అనసూయ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కు సంబంధించిన వార్త బయటకు వచ్చింది.
మైఖేల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా దక్కించుకుంది. ఇదే విషయాన్ని సినిమా ప్రారంభంలో డిస్ప్లే చేశారు మేకర్స్. మైఖేల్ బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయనేది తెలియాల్సి ఉంది. శ్యామ్ సీఎస్ కంపోజ్ చేసిన బీజీఎం సినిమాపై క్యూరియాసిటీ రేకెత్తించేలా ఉంది. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన మైఖేల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కింది.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, కరణ్ సి ప్రొడక్షన్స్ బ్యానర్లపై పీ రామ్మోహన్ రావు, భరత్ చౌదరీలు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది.