Mega 157 | సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం.. ‘మెగా 157’ అనౌన్స్మెంట్ వీడియో పంచుకున్న చిరు
Chiranjeevi – Anil ravipudi | అగ్ర కథానాయకుడు చిరంజీవి కొత్త సినిమాను షురూ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడితో తన కొత్త ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టాడు.
Chiranjeevi – Anil ravipudi | అగ్ర కథానాయకుడు చిరంజీవి కొత్త సినిమాను షురూ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడితో తన కొత్త ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టాడు.
మెగా157 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రాబోతుండగా.. ఉగాది పండుగ సందర్భంగా ఆదివారం ఉదయం పూజా కార్యక్రమాలతో ఆ చిత్రం ప్రారంభమైంది. కథనాయకుడు విక్టరీ వెంకటేశ్ క్లాప్‌ను ఇవ్వగా.. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. ఇక ఈ వేడుకలో నిర్మాతలు అశ్వనీదత్, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్‌బాబు, దిల్ రాజు, నాగవంశీ, దర్శకులు వశిష్ఠ, వంశీ పైడిపల్లి, శివ నిర్వాణ, బాబీ, శ్రీకాంత్ ఓదెల, రచయిత విజయేంద్ర ప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా ఈ సినిమాను నిర్మింస్తుండగా.. చిరంజీవి ఈ చిత్రంలో తన నిజ పేరైన శంకర్ వరప్రసాద్ పాత్రలో కనిపించనున్నారు. భీమ్స్ సంగీతం అందించబోతున్నాడు.
అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్కి సంబంధించి రఫ్ఫాడిద్దాం అంటూ ఒక వీడియోను పంచుకున్నాడు చిరు. ఈ వీడియోలో అనిల్ రావిపూడితో పాటు తన టీమ్ చిరుని పరిచయం చేసుకుని మెగా 157ని బ్లాక్ బస్టర్ చేద్దామంటూ చెప్పడం ఆసక్తిగా సాగింది. ఈ వీడియోలో చిరు పెద్ద కూతురు సుస్మిత కొణిదెల ఉండడం కూడ విశేషం.
Meeting our gang of #Mega157 🤗
Loved it @anilravipudi, i can imagine how entertaining the shoot is going to be on the sets!
SANKRANTHI 2026 రఫ్ఫాడిద్దాం 😉#ChiruAnil @Shine_Screens @GoldBoxEnt pic.twitter.com/ZKMv76vGfX
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 1, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

