Matti Kusthi Glimpse | కుస్తీకి సిద్దమవుతున్న విష్ణువిశాల్..గ్లింప్స్ వీడియో
ఇవాళ విష్ణు విశాల్పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ గ్లింప్స్ (Matti Kusthi glimpse) వీడియోను రిలీజ్ చేశారు. గ్లింప్స్ వీడియో ద్వారా వీర పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు. రెజ్లర్ (కుస్తీ వీరుడి)గా కనిపించబోతున్నాడీ హీరో.
కోలీవుడ్ యాక్టర్ విష్ణువిశాల్ (Vishnu Vishal)నటిస్తోన్న తాజా చిత్రం మట్టి కుస్తీ (Matti Kusthi). చెల్ల అయ్యవు దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్ మహారాజా రవితేజ హోం బ్యానర్ ఆర్టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్లపై విష్ణువిశాల్-రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇవాళ విష్ణు విశాల్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ గ్లింప్స్ (Matti Kusthi glimpse) వీడియోను రిలీజ్ చేశారు.
గ్లింప్స్ వీడియో ద్వారా వీర పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు. రెజ్లర్ (కుస్తీ వీరుడి)గా కనిపించబోతున్నాడీ హీరో. వీర బుల్లెట్‌పై వచ్చి రౌడీల పని పడుతున్న విజువల్స్ తో షురూ అయింది. ఆ తర్వాత రింగ్‌లోకి దిగి కుస్తీ పోటీలో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు. తాజా రషెస్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి ఫీ మేల్ లీడ్ రోల్ రోల్లో నటిస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
రిచర్డ్ ఎం నాథన్ కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నాడు. గతేడాది రానాతో తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన అరణ్యలో కీలక పాత్రలో నటించాడు విష్ణు విశాల్. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టింది. హోం బ్యానర్లో రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర చిత్రాలు కూడా వస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

