వినోదంతో కూడిన ఉత్కంఠ..
మలయాళంలో 200కోట్ల గ్రాస్‌ని రాబట్టి, బ్లాక్బాస్టర్గా నిలచిన చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్'. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధానపాత్రలు పోషించిన ఈ చిత్రానికి చిదంబరం ఎస్.పొదువల్ దర్శకుడు.
మలయాళంలో 200కోట్ల గ్రాస్‌ని రాబట్టి, బ్లాక్బాస్టర్గా నిలచిన చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధానపాత్రలు పోషించిన ఈ చిత్రానికి చిదంబరం ఎస్.పొదువల్ దర్శకుడు. పరవ ఫిలింస్ పతాకంపై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు. రీసెంట్గా తమిళంలో కూడా ఈ సినిమా విజయం సాధించింది. ఈ నెల 6న తెలుగు వెర్షన్ విడుదల కానుంది. ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్వారు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని ఆదివారం విడుదల చేశారు. ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమా ఎంత ఉత్కంఠకు గురిచేస్తుందో.. ఈ ట్రైలర్ కూడా అంత ఉత్కంఠభరితంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇది నిజమైన కథ ఆధారంగా రూపొందించబడిందని, ఫస్ట్ హాఫ్ మొత్తం వినోదంగా సాగితే, సెకండ్ హాఫ్ మొత్తం భావోద్వేగపూరితంగా, థ్రిల్స్‌తో నిండి ఉంటుందని, దర్శకుడు చిదంబరం అద్భుతమైన సర్వైవల్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను మలిచారని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: షైజు ఖలీద్, సంగీతం: సుశీన్ శ్యామ్, తెలుగు వెర్షన్ నిర్మాతలు: నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Renu Desai | నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?.. మాజీ భార్య ట్యాగ్‌పై నటి రేణు దేశాయ్ ఆవేదన
Supreme Court: ఢిల్లీ వెదర్ ఎంజాయ్ చేస్తున్నారనుకుంటా.. చమత్కరించిన సుప్రీంకోర్టు
హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దే : జగన్ మోహన్ రావు
Dada | బాలయ్య ‘దాదా’లో క్రేజీ ఐటెం సాంగ్.. థమన్ ఈసారి కూడా మాస్ బీట్తో దుమ్మురేపనున్నాడా?
Ramayana | రామ్ – రావణ్ వైభవాన్ని బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.. ‘రామాయణ’ సినిమాపై సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

