టాలీవుడ్ హీరో మంచు విష్ణు టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం జిన్నా (Ginna). బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్, ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇవాళ దసరా పండుగ సందర్భంగా జిన్నా ట్రైలర్ లాంఛ్ చేశారు మేకర్స్.
ఇషాన్ సూర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో టెంట్ హౌస్ నిర్వహించే యజమాని జిన్నా పాత్రలో విష్ణు కనిపించబోతున్నాడు. పాయల్ పల్లెటూరి యువతిగా, సన్నీలియోన్ మోడ్రన్ లేడీ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ-ఏవీఏ ఎంటర్టైన్మెంట్ (AVA Entertainment)పై మంచు విష్ణు తెరకెక్కిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే ఈ ఫన్ ఎంటర్టైనర్కు కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్. తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Happy Vijayadashami🏹to my dear brothers and sisters.
Excited to share #𝐆𝐢𝐧𝐧𝐚𝐓𝐫𝐚𝐢𝐥𝐞𝐫💥
Telugu▶️ https://t.co/qtsDro1qBr
Hindi▶️ https://t.co/3zeX5SFGti
Malayalam▶️ https://t.co/av820DQXWK@SunnyLeone @starlingpayal #GinnaOn21stOct💥 #HappyDussehra🏹 pic.twitter.com/KoS2puTdrg— Vishnu Manchu (@iVishnuManchu) October 5, 2022