2018 Movie | ఇండియా నుంచి ఆస్కార్ బరిలో మలయాళ చిత్రం ‘2018′
2018 Movie - Oscars | ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై సెన్సేషనల్ కలెక్షన్లు సాధించిన మలయాళ సినిమా 2018. టోవినో థామస్, కుంజకో బోబన్, అపర్ణ బాల మురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జూడ్ ఆంథోని జోసెఫ్ దర్శకత్వం వహించాడు.
2018 Movie | ‘ఆస్కార్ 2024’ అవార్డుల కోసం ఇండియా నుంచి మలయాళం చిత్రం ‘2018’ (2018 Movie) అధికారికంగా ఎంపికైయింది. వచ్చే ఏడాది ప్రదానం చేసే ఆస్కార్ అవార్డుల కోసం బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో ‘2018’ చిత్రాన్ని ఎంపిక చేశారు. ప్రముఖ దర్శకుడు గిరీష్ కాసరవల్లి అధ్యక్షతన 17మంది సభ్యులతో కూడిన ఆస్కార్ కమిటీ, ఆస్కార్ ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకున్న మొత్తం 22 చిత్రాలను కమిటీ వీక్షించిన అనంతరం.. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరి కోసం ‘2018’ సినిమాను ఎంపిక చేసింది.
2018లో కేరళలో సంభవించిన వరదల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో టోవినో థామస్ (Tovino Thomas) ప్రధాన పాత్ర పోషించారు. జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల గొప్ప భావోద్వేగాన్ని కలిగించింది. వరదల్లో మనమే చిక్కుకుపోయామా అనుకునేంత గొప్పగా దర్శకుడు ఈ చిత్రంలోని సన్నివేశాల్ని మలిచాడు.
‘ఎవ్రీవన్ ఈజ్ ఎ హీరో’ అనేది ఈ సినిమాకి ఉపశీర్షిక. ఆ ట్యాగ్ లైన్ కి తగ్గట్టు ఇందులోని ప్రతి పాత్ర ప్రేక్షకుడి మనసులో ముద్రవేసుకుంది. అటు కమర్షియల్ గానూ ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ.100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అత్యున్నత సాంకేతిక నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో ఆస్కార్ కి పోటీ పడుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Prints Fake Rs 500 Notes | ఇంటి అద్దె చెల్లించలేక.. నకిలీ రూ.500 నోట్లు ముద్రించిన వ్యక్తి
France Protests | ఫ్రాన్స్‌లో చెలరేగిన హింస.. 1000 మంది అరెస్ట్.. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్ల ప్రయోగం
AP News | రానున్న ఐదు రోజులు అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు ఏపీ హోంమంత్రి ఆదేశం..!
CULT Title | సూర్య సినిమా కోసం ‘కల్ట్’ టైటిల్ అడిగారు.. కానీ నేను ఇవ్వలేదు: విశ్వక్ సేన్
Rahul Gandhi | ‘మా ర్యాలీకి పబ్లిసిటీ చేస్తున్నందుకు థ్యాంక్స్’.. బీజేపీపై రాహుల్‌గాంధీ వ్యంగ్యాస్త్రాలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

