కష్టాలలో ఉన్న నటికి మాధురీ దీక్షిత్ ఆర్ధిక సాయం..!

సినిమా వాళ్ల కష్టాలు సినిమా వాళ్లకే తెలుస్తాయి. ఒకప్పుడు ఎంతో రిచ్‌గా బతికిన వాళ్లు ఇప్పుడు పొట్టకూటి కోసం ఎన్నో తిప్పులు పడుతున్నారు. ఇదే జాబితాలో షాగుప్తా ఆలీ ఉన్నారు. హిందీ టెలివిజన్ రంగంలో మూడు దశాబ్దాలకుపైగా ప్రధాన పాత్రలతో ప్రేక్షకులను ఆకర్షించిన షాగుఫ్తా ఆలీ కటిక దరిద్రంతోపాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది.తాజగా ఆమె జాతీయ టెలివిజన్ ఛానెల్లో ప్రసారం అయ్యే డ్యాన్స్ దీవానే షోకి హాజరు కాగా, తన కష్టాలను చెప్పుకొని బాధపడింది.
డ్యాన్స్ దీవానే 3 స్టేజ్‌పై మాట్లాడిన షగుఫ్తా ఆలీ .. దాదాపు 25 ఏళ్ల కెరీర్ బ్రహ్మండంగా సాగింది. నా కుటుంబాన్ని, నన్ను నేను సంరక్షించుకొన్నాను. కానీ గత నాలుగేళ్ల నుంచి రకరకాల ఆడిషన్స్‌కు వెళ్లాను కానీ వర్కవుట్ కాలేదు. దాంతో డయాబెటీస్ కారణంగా నా ఆరోగ్యం క్షీణించింది. కాళ్లు చచ్చుపడేంత ప్రమాదం ముంచుకొచ్చింది. అలాగే నా కంటిచూపు కూడా మందగించింది అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఆమె లైఫ్ హిస్టరీ విని హోస్ట్, కమెడియన్ భారతీ సింగ్ ఆమెను కౌగిలించుకొని ఓదార్చారు. న్యాయమూర్తి స్థానంలో ఉన్న మాధురి దీక్షిత్ చేతిలో చెక్కు పట్టుకొని నడుచుకొంటూ వచ్చి ఆమెను ఓదార్చారు. ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఆదుకోవడానికి డ్యాన్స్ దీవానే టీమ్ నిర్ణయం తీసుకొన్నది. ఈ టీమ్ తరఫు నుంచి మీకు రూ.5 లక్షలు అందిస్తున్నాం అంటూ మాధురీ దీక్షిత్ ఎమోషనల్ అయ్యారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Madhuri dixit
- tv artist
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

