రవీంద్రతేజ్ హీరోగా నటిస్తున్న గ్రామీణ ప్రేమకథా చిత్రం ‘లవ్ వాలా’ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రంజిత్ కుమార్ దేశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అరియా మోడీ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కొరటాల శివ క్లాప్‌నివ్వగా, బుచ్చిబాబు సానా కెమెరా స్విఛాన్ చేశారు.
గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథా చిత్రమిదని, సంగీతానికి ప్రాధాన్యత ఉంటుందని మేకర్స్ తెలిపారు. రాజ్ అర్జున్, మణిచందన, కమల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జమ్మా శ్రీను, సంగీతం: విజయ్ బుల్గానిన్, నిర్మాణ సంస్థ: స్వాన్ ఎంటర్టైన్మెంట్, సుభాకరి ఇన్ఫ్రా మీడియా, దర్శకత్వం: రంజిత్ కుమార్ దేశెట్టి.