కాత్యాయనిగా అలరిస్తా
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ తర్వాత కొన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ సెలక్టివ్‌గా వెళ్లాలని వెయిట్ చేశా. మంచి కంటెంట్ ఉన్న కథ కోసం ఎదురు చూస్తున్నప్పుడు ‘లిటిల్ హార్ట్స్' ప్రాజెక్ట్ నా దగ్గరకొచ్చింది.
‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ తర్వాత కొన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ సెలక్టివ్‌గా వెళ్లాలని వెయిట్ చేశా. మంచి కంటెంట్ ఉన్న కథ కోసం ఎదురు చూస్తున్నప్పుడు ‘లిటిల్ హార్ట్స్’ ప్రాజెక్ట్ నా దగ్గరకొచ్చింది. డైరెక్టర్ సాయిమార్తాండ్ ఈ కథ చెప్పినప్పుడు ఎైగ్జెటింగ్గా అనిపించింది. ప్రతి పాత్రనూ డిజైన్ చేసిన తీరు సూపర్. నా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’లో లవ్‌స్టోరీతోపాటు ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది. ఈ సినిమా అలా కాదు. ఇది కంప్లీట్ లైట్ హార్టెడ్ మూవీ. కాలేజీ రోజుల్లో ఉండే ఫన్‌తో ఈ సినిమా సాగుతుంది. యూత్‌కి విపరీతంగా నచ్చే సినిమా ఇది.’ అని శివాని నాగరం అన్నారు. మౌళి తనుజ్, శివాని నాగరం జంటగా నటించిన యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ‘లిటిల్ హార్ట్స్’.
సాయిమార్తాండ్ దర్శకుడు. ఆదిత్య హాసన్ నిర్మాత. బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వారా ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా కథానాయిక శివాని నాగరం మంగళవారం విలేకరులతో ముచ్చటించారు. ‘ఇందులో నా పేరు ‘కాత్యాయని’. ప్రతి అమ్మాయి తమతో తాము పోల్చుకునేలా నా పాత్ర ఉంటుంది. అఖిల్, కాత్యాయని స్నేహం, ప్రేమ.. ప్రతి ఒక్కరి కాలేజ్ రోజుల్ని గుర్తు చేస్తుంది. ఈ సినిమా థియేటర్కోసం చేసిందే అయినా.. బన్నీ వాస్, వంశీ నందిపాటి ఎంటర్ అయ్యాక, సినిమా రేంజ్ మారింది. ఈటీవీ విన్ రిలీజ్ చేస్తున్న తొలి థియేట్రికల్ ఫిల్మ్ ఇదే కావడం విశేషం’ అని తెలిపారు శివాని నాగరం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తెలంగాణలో మొదలైన నీటి కష్టాలు.. మంత్రి ఇలాఖాలో ఖాళీ బిందెలతో మహిళల నిరసన : వీడియో
Anirudh-Kavya | అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి రిసెప్షన్ కార్డు ఖరీదు ఎంతో తెలుసా.. ఒక్కో బాక్స్ ధర రూ.20 వేల వరకు!
Job Notification | రాష్ట్రంలో 102 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్
Kasturba School | రాఘవపూర్ కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని ఆకస్మిక మృతి
Ham Roads | హ్యామ్ రోడ్డు టెండర్ల కోసం మంత్రుల మధ్య వార్.. నలిగిపోతున్న అధికారులు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

