నేహా, వేదాంత్ వర్మ, ప్రణితా రెడ్డి నటిస్తున్న బాలల చిత్రం ‘లిల్లీ’. కె బాబురెడ్డి, జి సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. శివమ్ దర్శకుడు. ఇటీవల జరిగిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు శివమ్ మాట్లాడుతూ…‘దర్శకుడు మణిరత్నం రూపొందించిన అంజలి సినిమాను స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించాను. పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేసి ఒక బాలల చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం సంతోషంగా ఉంది.