జీవితకాలం దుఃఖమే..

‘నేను బ్రతికి ఉన్నంతకాలం మానసిక క్షోభకు గురవుతూనే ఉంటాను. ప్రమాదం నుంచి నన్ను దేవుడు రక్షించాడని సంతోషపడాలో లేదా నా ప్రాణ స్నేహితురాలిని కోల్పోయానని దుఃఖించాలో అర్థంకావడం లేదు’ అంటూ తమిళ నటి యాషిక ఆనంద్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆవేదన వ్యక్తం చేసింది. గత నెలలో ఆమె ప్రయాణిస్తున్న కారు చెన్నై సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ యాక్సిడెంట్లో ఆమె స్నేహితురాలు పావని మృతి చెందారు. తీవ్ర గాయాల పాలైన యాషిక ఆనంద్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవలే ఆమెకు మేజర్ సర్జరీని చేశారు. తాను మరో నాలుగు నెలల పాటు మంచానికే పరిమితమవ్వాల్సి ఉంటుందని యాషిక ఆనంద్ తెలిపింది. ‘నేను చేసిన తప్పుకు నా స్నేహితురాలు ఎప్పటికి నన్ను క్షమించదు. వారి కుటుంబానికి కన్నీళ్లు మిగిల్చినందుకు అనుక్షణం నేను కుమిలిపోతున్నా. ఐసీయూలో ఉన్నప్పటికీ ప్రతిక్షణం నాకు నా స్నేహితురాలే గుర్తుకొచ్చింది. ఆమె జ్ఞాపకాలు జీవితాంతం వెంటాడుతాయి’ అంటూ యాషిక ఆనంద్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

