Lavanya Tripathi | చిరంజీవి చాలా ఎంకరేజ్ చేస్తారు.. త్వరలోనే ఆయనతో సినిమా చేస్తానంటున్న లావణ్య
Lavanya Tripathi | మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. దేవ్ మోహన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ‘భీమిలీ కబడ్డీ జట్టు’ ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహించారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగ మోహన్ ఈ సినిమాను నిర్మించారు.
Lavanya Tripathi | మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. దేవ్ మోహన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ‘భీమిలీ కబడ్డీ జట్టు’ ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహించారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగ మోహన్ ఈ సినిమాను నిర్మించారు. సినిమా విడుదల సందర్భంగా లావణ్య త్రిపాఠి మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. లావణ్య మాట్లాడుతూ.. “‘సతీ లీలావతి’ సినిమా ఇప్పటికే చూశాను. చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. అయితే టీమ్ అందించిన సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా షూటింగ్ పూర్తి చేశాను” అని తెలిపారు.
షూటింగ్ సమయంలో ప్రతిరోజూ హాస్పిటల్‌కి వెళ్లి చెకప్ చేయించుకునేదాన్నని చెప్పిన లావణ్య.. “ఈ సినిమా కోసం బరువు కూడా తగ్గాను. యాక్షన్ సీన్స్ కూడా చేశాను. ముఖ్యంగా కాలితో కొట్టే ఒక సీన్ చేయాల్సి వచ్చింది. అప్పుడే కొంచెం కష్టంగా అనిపించింది. కానీ నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత కూడా స్క్రిప్ట్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. కేవలం యాక్షన్ సీక్వెన్స్‌ల్లో మాత్రమే జాగ్రత్తలు తీసుకున్నారు” అని పేర్కొన్నారు.ఈ సినిమాలో తాను దర్శకురాలి పాత్రలో కనిపిస్తానని, సినిమా పూర్తి వినోదాత్మకంగా సాగుతుందని లావణ్య చెప్పారు. “మా మేనేజర్‌తో కలిసి సినిమా చూస్తూ బాగా నవ్వుకున్నాం. కామెడీతో పాటు భావోద్వేగాలు కూడా ఉంటాయి. ఒక మంచి సందేశం కూడా ఉంటుంది. అయితే ఎక్కడా బోధిస్తున్నట్టు అనిపించదు” అని తెలిపారు.
వ్యక్తిగత జీవితంపై కూడా లావణ్య స్పందించారు. “నాకు నిజ జీవితంలో వరుణ్ లాంటి మంచి భర్త దొరికాడు. ప్రస్తుతం నేను నా భర్త, కొడుకుతో చాలా హ్యాపీగా ఉన్నాను. ఇకపై కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని అనుకుంటున్నాను. నా ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపాలని భావిస్తున్నాను” అని చెప్పారు.మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న సపోర్ట్ గురించి మాట్లాడుతూ.. “చిరంజీవి గారు ఎప్పుడూ మమ్మల్ని ప్రోత్సహిస్తుంటారు. ఆయనకు సినిమా ట్రైలర్ చూపించాలని అనుకుంటున్నాం. రామ్ చరణ్ కూడా ఎప్పుడూ సపోర్టివ్‌గానే ఉంటారు. మా సినిమా ట్రైలర్‌ను ఆయన విడుదల చేయడం మాకు మరింత రీచ్ తీసుకొచ్చింది” అని ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో భర్త వరుణ్ తేజ్‌తో కలిసి నటించే అవకాశం గురించి స్పందిస్తూ.. “మేమిద్దరం కలిసి నటించాలని ఉంది. ఇటీవల ఒక కథ కూడా వచ్చింది. కానీ రియల్ లైఫ్‌లో కలిసే ఉన్నాం కాబట్టి, స్క్రీన్‌పై కనిపించాలంటే కథ చాలా కొత్తగా ఉండాలి. అలాంటి కథ వస్తే తప్పకుండా ఆలోచిస్తాం” అని లావణ్య త్రిపాఠి వెల్లడించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

