Kriti Sanon | రాఖీ యాడ్ వివాదం.. ట్రోలర్స్‌కి మరోసారి కౌంటరిచ్చిన కృతి సనన్
Kriti Sanon | రాఖీ పర్వదినం సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన ఓ ఆభరణాల ప్రకటన సోషల్ మీడియాలో ఇటీవల తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే.
Kriti Sanon | రాఖీ పర్వదినం సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన ఓ ఆభరణాల ప్రకటన సోషల్ మీడియాలో ఇటీవల తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఆ యాడ్‌లో కృతి ధరించిన దుస్తులు, అలాగే పెంపుడు కుక్కకు రాఖీ కట్టడంపై కొందరు నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఈ ట్రోలింగ్‌పై కృతి సనన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చారు.
తన సోదరి నపుర్ సనన్‌తో కలిసి రాఖీ పండుగను జరుపుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న కృతి ఒక పోస్ట్ పెట్టింది. ఈ ఫొటోలో ఇద్దరి చేతులు మాత్రమే కనిపిస్తుండగా, ఇద్దరూ ఒకరికొకరు రాఖీలు కట్టుకుని ఉన్నారు. (రాఖీ ఫ్యాషన్ కమిటీ ఇంకా సమావేశంలోనే ఉన్నట్లుంది.. కానీ మేం మాత్రం అసలైన విషయాలపైనే దృష్టి పెట్టాం అంటూ) ఆమె రాసుకొచ్చారు. ఈ పోస్టు ద్వారా తన దుస్తులను విమర్శించిన వారికి ఆమె పరోక్షంగా చురకలంటించారు. అంతకుముందు కూడా మహిళల దుస్తుల ఆధారంగా వారి సంస్కృతిని, సంప్రదాయాలను జడ్జ్ చేయడంపై కృతి తీవ్రంగా స్పందించారు. పండుగలలో ముఖ్యం భావోద్వేగాలే తప్ప దుస్తులు కాదని ఆమె స్పష్టం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

